ట్రంప్ అభిశంసన: తొలి అంకం పూర్తి.. తాడోపేడో సెనేట్‌లోనే..!!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన ప్రక్రియలో తొలి అంకం పూర్తయ్యింది.

క్యాపిటల్‌ భవనంలో దాడి ఘటనను ప్రోత్సహించారని ఆరోపిస్తూ డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.

25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించి ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని వైస్ ప్రెసిడెంట్ మైక్‌ పెన్స్‌ను కోరుతూ డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశపెట్టారు.సోమవారమే ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టినా, రిపబ్లిక్‌ సభ్యులు దానిని అడ్డుకున్నారు.

అయితే 25వ సవరణ అధికారాన్ని ఉపయోగించేందుకు తాను సిద్ధంగా లేనంటూ పెన్స్‌ గతంలోనే తన మనోగతాన్ని వెల్లడించారు.అయినప్పటికి ప్రతినిధుల సభ స్పీకర్‌ పెలోసీ పంతంకొద్దీ ఈ తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించారు.

అయితే దీనిని మైక్ పెన్స్‌ తోసిపుచ్చారు.దీంతో డెమొక్రాట్లు సోమవారం ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానంపై బుధవారం ప్రతినిధుల సభలో చర్చ సాగింది.

Advertisement

చర్చ అనంతరం ప్రతినిధుల సభలో 232-197 ఓట్లతో అభిశంసన తీర్మానం నెగ్గింది.ట్రంప్‌ సొంత పార్టీకి చెందిన 10 మంది రిపబ్లికన్లు అభిశంసన తీర్మానానికి మద్దతుగా ఓటేయడం గమనార్హం .మరోవైపు నలుగురు కాంగ్రెస్‌ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు.ఇక ఇండో అమెరికన్ సభ్యుల విషయానికి వస్తే.

మనోళ్లు నలుగురు అభిశంసనకు మద్దతు తెలుపుతూ ఓటేశారు.ప్రతినిధుల సభలో ఆమోదం పొందండంతో ఈ తీర్మానంపై సెనెట్‌ ఓటింగ్‌ నిర్వహించనుంది.

అక్కడ కూడా సెనేటర్లు అభిశంసనకు అనుకూలంగా ఓటేస్తే ట్రంప్‌ అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్నారు.అయితే సెనెట్‌ ఈనెల 19కి వాయిదా పడింది.

సెనెట్‌లో అభిశంసనను నెగ్గించుకోవడానికి డెమొక్రాట్లకు 17 ఓట్లు అవసరం.మొత్తం మీద అగ్రరాజ్య చరిత్రలో రెండు సార్లు అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ అపఖ్యాతి పాలయ్యారు .

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు