2024 ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయి..: సీఎం జగన్

2024 ఎన్నికలు( 2024 Elections ) చరిత్రలో నిలిచిపోతాయని ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) అన్నారు.మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా చింతలపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

 2024 Elections Will Go Down In History Cm Jagan Details, 2024 Elections, Ap Cm J-TeluguStop.com

‘సిద్ధం’ సభలను చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని సీఎం జగన్ తెలిపారు.టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu ) తనపై రాళ్లు వేయమంటున్నారన్న ఆయన జగన్ ను కొట్టడానికి వాళ్లకు అధికారం కావాలంటున్నారని పేర్కొన్నారు.

పేదలకు చంద్రబాబు ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు.జగన్ కు కోట్ల మంది ప్రజలు తోడు ఉన్నారని చెప్పారు.

ఒంటరిగా పోటీ చేసేందుకు చంద్రబాబు భయపడుతున్నారన్నారు.

చంద్రబాబు తనను బచ్చా అంటున్నారని, ఆ బచ్చా చేతిలో ఓడిపోయిన చంద్రబాబును ఏమనాలని ప్రశ్నించారు.

తాము చేసిన మంచిని చెప్పుకుని ఓటు అడుగుతున్నామని తెలిపారు.గతంలోని టీడీపీ ప్రభుత్వం ఇంత మంచి చేసిందా ? గత ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.కనీసం చంద్రబాబు అయినా ఇలాంటి పథకాలను చూశారా అన్నది చెప్పాలన్నారు.రూ.2.70 లక్షల కోట్లు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో వేశామన్న ఆయన ఇది జగన్ మార్క్ పాలన అని స్పష్టం చేశారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube