2024 ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయి..: సీఎం జగన్

2024 ఎన్నికలు( 2024 Elections ) చరిత్రలో నిలిచిపోతాయని ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) అన్నారు.

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా చింతలపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

‘సిద్ధం’ సభలను చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని సీఎం జగన్ తెలిపారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu ) తనపై రాళ్లు వేయమంటున్నారన్న ఆయన జగన్ ను కొట్టడానికి వాళ్లకు అధికారం కావాలంటున్నారని పేర్కొన్నారు.

పేదలకు చంద్రబాబు ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు.జగన్ కు కోట్ల మంది ప్రజలు తోడు ఉన్నారని చెప్పారు.

ఒంటరిగా పోటీ చేసేందుకు చంద్రబాబు భయపడుతున్నారన్నారు.చంద్రబాబు తనను బచ్చా అంటున్నారని, ఆ బచ్చా చేతిలో ఓడిపోయిన చంద్రబాబును ఏమనాలని ప్రశ్నించారు.

తాము చేసిన మంచిని చెప్పుకుని ఓటు అడుగుతున్నామని తెలిపారు.గతంలోని టీడీపీ ప్రభుత్వం ఇంత మంచి చేసిందా ? గత ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

కనీసం చంద్రబాబు అయినా ఇలాంటి పథకాలను చూశారా అన్నది చెప్పాలన్నారు.రూ.

2.70 లక్షల కోట్లు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో వేశామన్న ఆయన ఇది జగన్ మార్క్ పాలన అని స్పష్టం చేశారు.

15 కుక్కలను స్లిప్పర్‌తో బెదరగొట్టిన హైదరాబాదీ యువతి.. వీడియో వైరల్..