2022 లో మతం ఆధారం గా వచ్చిన సినిమాలు ఇవే !

హిందూ వర్సెస్ ముస్లిం అనే కంటెంట్ ని బేస్ చేసుకొని ఆది నుంచి అనేక సినిమాలు వస్తున్నాయి.

అందులో కొన్ని విద్వేషాలను సృష్టిస్తే మరి కొన్ని కథలో లోలోన లీనమై మనల్ని నడిపించాయి.

ఈ ఏడాది ఇదే కోవలో మరి కొన్ని సినిమాలు రాగా వాటిల్లో ఒక్కో దానికి ఒక్కో రకమైన ప్రభావం ప్రజల్లో కనిపించింది.అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే ఈ ఏడాది ఈ కోణం లో వచ్చిన అన్ని సినిమాలు కూడా విజయం సాధించాయి.

అవేంటో ఒక్కక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆర్ ఆర్ ఆర్

రాజమౌళి తీసిన ఈ సినిమాలో మతం ప్రధాన అంశం కాకపోయినా హిందూ ముస్లిం స్నేహితులుగా రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కనిపించారు.మతం కాన్సెప్ట్ లో కి పూర్తిగా వెళ్లకుండా స్వాతంత్య్రం కోసం ఎవరి పరిధిలో వారు పోరాటం చేసే యోధులుగా వీరు ఈ చిత్రంలో నటించారు.ఇక ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం గురించి అందరికి తెలిసిందే.

కాశ్మీర్ ఫైల్స్

Advertisement

కాశ్మీర్ అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని అర డజన్ కి పైగా సినిమాలు ఇప్పటికే వచ్చాయి.అయితే ఈ ఏడాది వచ్చిన కాశ్మీర్ ఫైల్స్ సినిమా 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 340 కోట్లు వసూల్ చేసింది.వస్తావా సంఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమాను చూడాలని దేశ ప్రధాని స్వయంగా విజ్ఞప్తి చేసారు .అలాగే అనేక రాష్ట్రాల్లో పన్ను మినహాయింపును పొందింది.ఈ సినిమా పై జనాల్లో బాగా ఆసక్తి పెరిగి విపరీతంగా చూసారు.

ఇక కాశ్మీర్ పండిట్ల పై షికారా అనే సినిమా వచ్చిన కాశ్మీర్ ఫైల్స్ చిత్రం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.ఇక ఈ సినిమాపై చాల విమర్శలు కూడా ఉన్నాయ్.

సీతారామం

ఒక ప్రేమ కథలో దేశం లో జరిగిన కొన్ని అల్లర్లను హృదయాలకు హత్తుకునే విధంగా చూపించి హిందూ ముస్లిమ్స్ అంత ఒక్కటే అనే అర్ధం వచ్చేలా సినిమాను చక్కగా తీశారు హను రాఘవ పూడి.చిత్రం ఆసాంతం ప్రేమ కథను బాగా ఎలివేట్ చేసారు.ఎక్కడ కూడా రెండు దేశాల ఘర్షణ అనే ఫీల్ రాకుండా పక్క దేశంలో కూడా మనుషులు ఉన్నారు అనే కోణాన్ని చూపించారు.

ఈ చిత్రం ఈ ఏడాది మంచి విజయాన్ని సాధించింది.

ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?
Advertisement

తాజా వార్తలు