అమెరికా : భారతీయ మహిళలపై యువకుడి కాల్పులు .. ఒకరు మృతి

అమెరికా( America )లో దారుణం జరిగింది.ఓ యువకుడు ఇద్దరు భారతీయ మహిళలపై కాల్పులు జరిపిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

బాధితులను పంజాబ్‌లోని నూర్మహల్ సమీపంలోని గోర్సియన్ పీరన్ గ్రామానికి చెందిన జస్వీర్ కౌర్ (29), గగన్ (20)గా గుర్తించారు.వివాహిత అయిన జస్వీర్ తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.

నిందితుడిని పంజాబ్‌లోని హుస్సేన్‌పూర్ గ్రామానికి చెందిన గౌరవ్ గిల్ (21)( Gaurav Gill )గా గుర్తించిన అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గౌరవ్, గగన్‌లు అమెరికాకు వెళ్లే ముందు పంజాబ‌్‌లోని ఐఈఎల్‌టీఎస్ సెంటర్‌లో కలిసి చదువుకునేవారు.

నిరుపేద కుటుంబాలకు చెందిన వీరిద్దరిని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి విదేశాలకు పంపించారు.

2 Cousin Sisters From Punjab Shot By Indian Boy In Us, One Dies Of Wounds , Jas
Advertisement
2 Cousin Sisters From Punjab Shot By Indian Boy In US, One Dies Of Wounds , Jas

నివేదికల ప్రకారం .బుధవారం గౌరవ్ న్యూజెర్సీలోని గగన్, జస్వీర్‌( Jasvir Kaur , Gagandeep Kaur ) ఇంటికి వెళ్లి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో జస్వీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.

గగన్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.టీషర్ట్, స్లాక్స్ ధరించిన గౌరవ్‌ను న్యూజెర్సీ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇంటి లాన్ వద్ద అదుపులోకి తీసుకున్న సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

2 Cousin Sisters From Punjab Shot By Indian Boy In Us, One Dies Of Wounds , Jas

గౌరవ్, గగన్‌ కలిసి టీవోఈఎఫ్ఎల్ సెంటర్‌కు వెళ్లేవారని గ్రామస్తులు గుర్తుచేసుకున్నారు.ఈ దారుణ ఘటనతో వారి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారని, వీరిద్దరూ అమెరికాలో ఎలా కలిశారో తమకు తెలియదని వారు చెబుతున్నారు.గ్రామ సర్పంచ్ తెలిపిన వివరాల ప్రకారం ఇరు కుటుంబాలు తీవ్రమైన పేదరికంలో ఉన్నాయి.

యువకుడి తండ్రి మస్కట్‌లో ఉన్నాడని.తమ్ముడు ఇంకా చదువుకుంటున్నాడని అమెరికా వెళ్లినప్పటికీ గౌరవ్ తన కుటుంబసభ్యులతో క్రమం తప్పకుండా ఫోన్‌లో మాట్లాడేవాడని హుస్సేన్‌పూర్ గ్రామ సర్పంచ్ జగ్మీత్ సింగ్ తెలిపారు.

భారతీయుల పొదుపు మంత్రం – ప్రపంచానికే మార్గదర్శకం
ఎన్టీఆర్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా.. ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారా?

దళిత వర్గానికి చెందిన గౌరవ్ కుటుంబం ఆటా చక్కీ అమ్ముతూ జీవిస్తోందని వెల్లడించారు.గగన్, గౌరవ్ కలిసి ఐఈఎల్‌టీఎస్ చదివారని.

Advertisement

అప్పటి నుంచే వీరికి పరిచయం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.మృతురాలు జస్వీర్ కౌర్‌కు రెండేళ్ల క్రితం అమెరికాలో ట్రక్కు డ్రైవర్‌తో వివాహమైంది.

కాల్పుల ఘటన జరిగినప్పుడు ఆమె భర్త ఇంట్లో లేడు.

తాజా వార్తలు