ఆక్రమణకు గురైన 2 ఎకరాల భూమి ప్రభుత్వానికి అప్పగింత..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆక్రమణకు గురైన రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని లక్ష్మీపురం మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ తిరిగి ప్రభుత్వానికే అప్పగించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు.

సోమవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం లో ప్రభుత్వ భూమి అప్పగింత పై ఎస్పీ అఖిల్ మహజాన్ తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ 2018 సంవత్సరంలో తాడూరు గ్రామ సర్వే నెంబర్ 545/1/1/3/1 లో గల 2 ఎకరాల భూమి ప్రభుత్వం తనకు కేటాయించిందని, 2 ఎకరాల భూమిని మాజీ సర్పంచ్ పద్మ ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని కలెక్టర్ తెలిపారు.జిల్లాలో ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడి ఉంటే సదురు భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని, ఈ భూములను పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తామని, పేద ప్రజలకు ఇంటి పట్టాల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు.2018 నుంచి 2023 వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ రైతు బంధు మొదలైన ప్రభుత్వ పథకాలు లబ్ది పొందినందుకు ఆ సొమ్ము రికవరి కోసం డిమాండ్ నోటీసు జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సమావేశంలో పాత్రికేయులు తదితరులు ఉన్నారు.

ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..

Latest Rajanna Sircilla News