సంబరాల్లో అపశృతి.. గాలిలోకి కాల్పులు.. 17 మంది మృతి

సంబరాల్లో అపశృతి.గాలిలోకి కాల్పులు.17 మంది మృతి. ఆఫ్గాన్ లో పంజ్ షీర్ ను ఆక్రమించుకున్న మంటూ తాలిబన్లు చేసుకున్న సంబరాలు అపశృతి చోటు చేసుకుంది శుక్రవారం తాలిబన్లు గాలిలోకి అనేకమార్లు కాల్పులు జరిపారని ఈ సంఘటనలో సుమారు 17 మంది చనిపోగా 41 మంది గాయపడినట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు.

 17 Dead, 41 Injured In Citywide Open-air Firing In Kabul, Kabul, Taliban, Fire I-TeluguStop.com

అల్లా కు  కృతజ్ఞతలు తెలుపుతూ గాల్లోకి కాల్పులు జరగడం అనేది ఒక సంప్రదాయం అని అన్నారు.పంజ్ షీర్ వశం  చేసుకున్నట్లు వార్తలు వెలువడగానే ఆఫ్గాన్ రాజధాని కాబూల్ లో తూర్పున ఉన్న నాన్ఘర్హ్ ప్రాంతంలో తాలిబాన్లు గాల్లోకి కాల్పులు జరిపారని తెలిపారు ఆగస్ట్ 31న అమెరికా బలగాలు ఉపసంహరించుకున్న సమయంలో కూడా తాలిబన్లు ఇదేవిధంగా గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

ఈవిధంగా గాల్లోకి కాల్పులు జరపడాన్ని నిలిపివేయాలని ఇది ఆఫ్గాన్ పౌరులు ప్రమాదకరంగా మారిందని ముజాహిద్ ట్వీట్ చేశారు.అనవసరంగా కాల్పులు జరప వద్దని హెచ్చరించారు.ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు.మెరుపు దాడులతో ఆఫ్ఘనిస్తాన్ ను తన వశం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాట్లు మాత్రం మల్లగుల్లాలు పడుతున్నారు.

అంతర్జాతీయ సమాజం సమ్మిళిత పాలనా యంత్రాంగాన్ని రూపొందించడంలో తాలిబాన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీంతో ప్రభుత్వం ఏర్పాటు మరోసారి వాయిదా వేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube