1.. 2.. 3.. ర్యాంక్ లలో టీమిండియా .. ఎలా అంటే..?!

తాజాగా అంతర్జాతీయ క్రికెట్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో టీమ్ ఇండియా మూడు ఫార్మాట్లలో మూడు ర్యాంకులు పొందింది.ఇందులో భాగంగానే తాజాగా ప్రకటించిన టీమిండియా ర్యాంకింగ్స్ లో టెస్టులలో టీమిండియా మొదటి స్థానంలో కొనసాగుతుండగా.

టి-20లో భారత్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.అయితే వన్డేల్లో మాత్రం టీమిండియా ఏకంగా మూడో స్థానానికి దిగజారింది.

తాజాగా ఐసీసీ వార్షిక ర్యాంకింగ్ లను విడుదల చేయడంతో ఈ విషయం వెల్లడైంది.ఇందులో భాగంగానే టీమిండియా టెస్టు లలో చూస్తే 120 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా 118 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంలో, 113 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతోంది.

ఇక టీ- 20 లో ర్యాగింగ్ విషయానికి వస్తే 277 పాయింట్లతో ఇంగ్లాండ్ జట్టు మొదటి స్థానంలో కొనసాగుతుండగ 272 పాయింట్లతో టీమిండియా జట్టు రెండో స్థానంలో నిలబడింది.ఆ తర్వాత 262 పాయింట్లతో న్యూజిలాండ్ మూడో స్థానాన్ని దక్కించుకుంది.

Advertisement

ఇక వన్డేల విషయానికి వస్తే న్యూజిలాండ్ జట్టు 121 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఆ తర్వాత 118 పాయింట్లతో ఆస్ట్రేలియా జట్టు రెండో స్థానంలో ఉంది.115 పాయింట్లతో టీమిండియా మూడో స్థానానికి పరిమితమైంది.కేవలం దశాంశ స్థానాలలో కాస్త వెనుక పడడంతో ఇంగ్లాండ్ జట్టు 4 వ స్థానానికి పరిమితమైంది.

 వన్డేలో న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్ పై 3 - 0 తో విజయం సాధించడంతో న్యూజిలాండ్ మొదటి స్థానానికి చేరుకోగా.అంతకుముందు టీమిండియా రెండో స్థానంలో ఉండగా న్యూజిల్యాండ్ మొదటి స్థానానికి రావడంతో టీమిండియా మూడో స్థానానికి రాక తప్పలేదు.

Advertisement

తాజా వార్తలు