విశాఖలో పరిస్థితికి పోలీసుల వైఫల్యమే కారణం.. బీజేపీ నేత ఆరోపణ

విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద చోటు చేసుకున్న ఉద్రిక్తతకు కారణం పోలీసుల వైఫల్యమేనని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.

విశాఖలో వైసీపీ స్పాన్సర్డ్ ప్రోగ్రాం జరిగిందన్నారు.

విశాఖకు జనసేన పార్టీ అధినేత పవన్ వస్తున్న సమయంలో మంత్రుల కాన్వాయ్ ను పోలీసులు ఎందుకు అనుమతించారని ఆయన ప్రశ్నించారు.ఏ పార్టీకైనా రక్షణ కల్పించాల్సింది ప్రభుత్వమేనని తెలిపారు.

అసలు విమానాశ్రయం వద్ద ఏం జరిగిందో తెలియటానికి పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.అయితే విశాఖ ఎయిర్ పోర్ట్ సమీపంలో మంత్రులు రోజా, జోగి రమేశ్ తో పాటు వైవీ సుబ్బారెడ్డిల వాహనాలపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారనే వాదనలు వచ్చిన సంగతి తెలిసిందే.

జనసేన కార్యకర్తలు కర్రలతో దాడి చేసారని మంత్రులు ఆరోపించారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు