రహదారి విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలి:కలెక్టర్

నల్గొండ జిల్లా:పట్టణ సుందరీకరణలో భాగంగా చేపట్టిన ఎన్.

హెచ్ 565 రహదారి అభివృద్ధి, విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ డిఈఓ కార్యాలయం నుండి సాగర్ జoక్షన్ వరకు పనులు తనిఖీ చేశారు.రహదారి అభివృద్ధి,విస్తరణ,సైడ్ డ్రైన్స్,విద్యుత్ స్తంభాలు షిఫ్టింగ్ పనులు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

జిల్లా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,మున్సిపల్ కమిషనర్ డా.కె.వి.రమణాచారి,ఎస్.పి.డి.సి.ఎల్.డి.ఈ.విద్యాసాగర్,నేషనల్ హైవే అధికారులు ఉన్నారు.

టి-టీడీపికి పూర్వ వైభవం వస్తుంది
Advertisement

తాజా వార్తలు