గురువులు ఎన్ని రకాలు.. వారి పూర్తి వివరాలు ఇవే..!

ప్రస్తుత సమాజానికి జ్ఞానాన్ని అందించే వాడే గురువు( Teacher ) అని దాదాపు చాలా మందికి తెలుసు.అయితే గురువుల్లో అనేక రకాల వారు ఉంటారు.

మనిషి తన అవసరాలను బట్టి సంబంధిత గురువును ఆశ్రయించి జ్ఞానాన్ని పెంచుకోవాలి.అలాంటి గురువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే బాల్యం నుంచి పై చదువు వరకు చదువు చెప్పే వారు గురువులు.శిష్యుడికి( Student ) మంచి చదువు తర్వాత ఉపాధి, గుర్తింపును సాధించేందుకు అవసరమైన సలహాలను సూచనలను ఇచ్చే వారినే సూచక గురువు( Referral Teacher ) అని అంటారు.

ఇంకా చెప్పాలంటే ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది మంచిది, ఏది కాదు అనే తేడాను వివరించడంతో పాటు బ్రహ్మచర్యము , గృహస్థాశ్రమము, వానప్రస్దం, సన్యాస ఆశ్రమాల్లో ఎలా జీవించాలో నేర్పించే వారినే వాచక గురువు అని అంటారు.

Advertisement

ఇంకా చెప్పాలంటే కోరికలు తీర్చే మార్గాలను, మరణాంతరం మోక్షాన్ని అందించే మంత్రాలను బోధక గురువు( Bodhaka Guru ) ఉపదేశిస్తారు.ఈ గురువు మార్గదర్శకత్వంలో మనిషి లౌకిక మార్గం నుంచి అలౌకిక మార్గం వైపు అడుగులు వేస్తాడు.అంతేకాకుండా వశీకరణాలు, చేతబడులు, తాంత్రిక విద్యలు నేర్పు గురువును నిషిద్ధ గురువు అని పిలుస్తారు.

వీరి వద్దకు వెళ్లకపోవడమే మంచిది.వీరు మనసును శుద్ధి చేయకపోగా మీ మనసులోని మంచినీ దూరం చేస్తారు.

వీరి దగ్గర చేరిన వారికి పతనం తప్పదు.అలాగే లౌకికమైన విషయాల పై ఆసక్తిని తగ్గించి శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైన అంశాల దిశగా తన శిష్యుడి మనసును మళ్లించేందుకు నిరంతరం ప్రతించే వారిని విహిత గురువులు అని పిలుస్తారు.

అలాగే కారణ గురువు కేవలం మోక్షం గురించి మాత్రమే బోధిస్తాడు.మనిషి భూమి మీద ఎన్ని సుఖాలను అనుభవించిన ఒకరోజు వీటిని వదిలి వెళ్లాల్సిందేనని, కాబట్టి ముందుగానే మోక్ష సాధన దిశగా మనిషి ప్రయత్నించాలని బోధిస్తారు.అలాగే పరమ గురువు( Supreme Guru ) సాక్షాత్ భగవంతుని స్వరూపం తన అవసరం ఉన్న శిష్యుని కోసం వీరే వెతుక్కుంటూ వస్తారు.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై4, గురువారం 2024

సృష్టిలో చైతన్యాన్ని గుర్తించి దానిని అనుక్షణం అనుభవంలో నిలుపుకోగలిగిన వారే ఈ పరమ గురువులు.రామకృష్ణ పరమహంస వంటి వారంతా ఈ కోవకు చెందినవారే.

Advertisement

తాజా వార్తలు