కంటి వెలుగుతో పేదల జీవితాల్లో నూతన వెలుగులు:మున్సిపల్ చైర్ పర్సన్

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.

సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 30వ వార్డ్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.

అందత్వ రహిత తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు.పెద్ద ఆసుపత్రులకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోలేని నిరుపేదలకు కంటి వెలుగు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

Kanti Velugu In The Lives Of The Poor With The Light Of The Eye: Municipal Chai

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సహకారంతో పట్టణంలోని అన్ని వార్డులలో కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ముఖ్యంగా ప్రజలు కంటి పరీక్షలను నిర్లక్ష్యం చేయకుండా సరైన చికిత్సలు చేయించుకుని మందులు,అద్దాలు పొంది కంటి సమస్యలను దూరం చేసుకోవాలన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య మహిళ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొదలుపెట్టారని,ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రతి అర్బన్ సెంటర్లో ప్రతి మంగళవారం నిర్వహించడం జరుగుతుందని,ఇందులోఎనిమిది రకాల చికిత్సలు చేయబడతాయని,ప్రతి మహిళ ఆరోగ్య మహిళను వినియోగించుకోవాల్సిందిగా కోరారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామంజుల రెడ్డి,వార్డు కౌన్సిలర్ పల్సర్ మహాలక్ష్మి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు గాలి రమాదేవి,గాలి సాయి, బొమ్మగాని శ్రీనివాస్, బత్తుల రమేష్, దక్షపల్లీ సుజాత,ఉపేందర్ రెడ్డి, శంకరయ్య,సైదమ్మ, కోటమ్మ,రాంప్రసన్న, సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్,సిఓ శ్వేత,కంటి వెలుగు టీం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Press Releases News