ఈ చిట్కా పాటేస్తే జుట్టు రాలే సమస్యే ఉండదు

సాధారణంగా చాలామంది జుట్టు రాలడం అంటే పొల్యూషన్ లో తిరగడం వల్ల‌, ఒత్తిడి , ఆలోచనలు వల్ల‌ ఊడిపోతోంద‌ని చెప్తారు.

కానీ అధికశాతం జుట్టు ఊడటానికి కారణం పోషకవిలువలు సరిగా జుట్టుకి అందకపోవడం వల్లే.

అందుకే తప్పనిసరిగా పోషకాలు జుట్టుకు అందేలా చూసుకోవాలి.తల దువ్వుకునేప్పుడు జుట్టు రాలడం సహజం.

Home Remedies For Hair Fall-ఈ చిట్కా పాటేస్తే జ

అయితే ఇది మరీ ఎక్కువగా ఉంటే జింక్‌ లోపం ఉండొచ్చని సందేహించాలి.సాధారణంగా ఈ లోపం ఉన్నప్పుడు ముందు జుట్టు పలుచగా మారి తరవాత రాలడం మొదలవుతుంది.

నువ్వులూ, గుమ్మడి గింజలూ, పుచ్చకాయ గింజలూ, డార్క్‌ చాక్లెట్‌, పల్లీలు లాంటి వాటిల్లో జింక్‌ పుష్కలంగా లభిస్తుంది.జుట్టు నల్లగా నిగనిగలాడుతూ కనిపించేందుకు తలలో ఉండే మెలనిన్‌ కారణం.

Advertisement

సిలికా అనే ఖనిజ లవణం జుట్టుకు తేమను అందించి, వెంట్రుకల్ని దృఢంగా ఉంచుతుంది.యాపిల్స్‌, కమలా ఫలాలు, ఎండుద్రాక్ష, ఉల్లిపాయలు, క్యారెట్లు, ఓట్స్‌, పీచు ఎక్కువగా ఉండే పదార్థాలన్నీ సిలికాను అందిస్తాయి.

మన తలని క్లీన్‌ గా ఉంచుకోవాలి.షాంపో ,కండిషనర్ వాడి ప్రతిరోజూ శుబ్రము చేసుకోవాలి.

తలకి సరియైన నూనె రాస్తూఉండాలి.ఇలా చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు.

మంచు ఖండంలో మజా ట్రిప్.. అంటార్కిటికాలో శృంగార యాత్ర... ఖర్చు రూ.10 లక్షలు మాత్రమే!
Advertisement

తాజా వార్తలు