అమెరికా అధ్యక్ష బరిలో బ్లూమ్ బర్గ్...!!!

అమెరికా అధ్యక్ష పీటం కైవసం చేసుకోవడానికి రిపబ్లికన్ ,డెమోక్రటిక్ పార్టీలు పోటీలు పడుతున్నాయి.

ఊహించని విధంగా ఎవరికీ వారు హామీలు ఇస్తూ అమెరికా ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే సుమారు 20 మంది డెమోక్రటిక్ పార్టీ తరపు అధ్యక్ష బరిలో ఉండగా తాజాగా మరొక మేయర్ సైతం తాను కూడా అమెరికా అధ్యక్ష పోటీలో ఉన్నట్లుగా ప్రకటించారు.న్యూయార్క్ నగర మాజీ మేయర్ బ్లూమ్ బర్గ్ తాను కూడా డెమోక్రటిక్ పార్టీ తరుపున బరిలో ఉన్నానని, తన గెలుపు తధ్యమని ప్రకటించారు.

అంతేకాదు ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశారు.తన ఆలోచనలతో కూడిన ఒక్క నిమిషం నిడివి ఉన్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

బ్లూమ్ బర్గ్ తన సొంత వెబ్ సైట్ లో ఈ వీడియో ని ఉంచారు.తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తాడు అనేది ఒక్క నిమిషంలోనే చెప్పేశాడు.ధనికుల కి పన్ను పోటు పెంచుతూ మధ్య తరగతి వారికి పన్నులు లేకుండా చేస్తానని హామీ ఇచ్చాడు.

Advertisement

అలాగే ప్రతీ ఒక్కరికి ఆరోగ్య భీమా అమలు చేస్తానని హామీ ఇచ్చారు.ప్రస్తుత అమెరికా రూపు రేఖలు మార్చేస్తానని , ట్రంప్ పాలన ఎంతో దుర్భరంగా ఉందని దుయ్యబట్టారు.

మరి బ్లూమ్ బర్గ్ అభ్యర్ధిత్వాన్ని అమెరికా ప్రజలు ఆహ్వానిస్తారో, తిరస్కరిస్తారో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు