ఈమధ్య అనుమానం కారణంగా ఎంతో మంది తమ జీవితాలను తామే దారుణంగా నాశనం చేసుకుంటున్నారు.భారతదేశంలో వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
కానీ ఒక చిన్న అనుమానంతో మాంగళ్య బలాన్నే చంపుకుంటున్నారు.పెళ్లయి నాలుగు నెలలు కూడా కాకముందే భార్యపై అనుమానంతో అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.అదిలాబాద్ జిల్లా( Adilabad ) లోని బంగారు గూడాలో నివాసం ఉంటున్న అరుణ్, రూప అనే దంపతులకు నాలుగు నెలల క్రితం వివాహం అయ్యింది.వివాహం అయిన తర్వాత ఆషాడ మాసం కారణంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ లోని పుట్టింటికి వెళ్ళిన రూప నాలుగు రోజుల కిందటే అత్తారింటికి వచ్చింది.ఏమైందో తెలియదు కానీ భార్య రూపం హత్య చేసిన అరుణ్( Arun ) పోలీస్ స్టేషన్లో లొంగిపోయేందుకు బైక్ పై వెళుతూ విధి ఆడిన వింత నాటకంలో అనూహ్యంగా ఆగి ఉన్న లారీని ఢీ కొట్టి దుర్మరణం చెందడం విషాదాన్ని మిగిలింది.
దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలాలను పరిశీలించిన పోలీసులు( Police ) వివరాలను సేకరించారు.భార్య రూపను హత్య చేయడానికి అనుమానమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.దీనిపై పూర్తి సమాచారం సేకరించేందుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
అనంతరం మృతురాలి బంధువులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని ఆదిలాబాద్ లోని రిమ్స్ మార్చురీకి తరలించారు.మరోవైపు ప్రమాదంలో మృతి చెందిన అరుణ్ ను కూడా అదే మార్చురికి తరలించారు.
ఆస్పత్రి వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు ముందుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.నవ దంపతుల మృతితో రెండు కుటుంబాలలో తీవ్ర విషాదం అలుముకుంది.