హైపర్ పిగ్మెంటేషన్ రావటానికి కారణాలు ఏమిటి?

హైపర్ పిగ్మెంటేషన్ రావటానికి అనేక కారకాలు మరియు కారణాలు ఉన్నాయి.హైపర్ పిగ్మెంటేషన్ రావటానికి ఒక కారణం లేదా రెండు,మూడు కారణాలు కలిసి ఉండవచ్చు.

1.గాయాలు

చర్మం వాచినప్పుడు మరియు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అయ్యే గాయాలు మానిన తర్వాత ఆ మచ్చలు అలాగే ఉండిపోతాయి.ఆ మచ్చలు హైపర్ పిగ్మెంటేషన్ కి దారి తీస్తాయి.

2.సూర్యుడు

చర్మంలో పిగ్మెంట్ రావటానికి కారణం సూర్యుని కిరణాలు మరియు వేడి అని చెప్పవచ్చు.ఎండలోని అతినీలలోహిత కిరణాలు నేరుగా చర్మం మీద పడినప్పుడు మెలనిన్‌ని ఉత్పత్తి చేసే కణాలు ప్రభావితం అయి పిగ్మెంట్ రావటానికి కారణం అవుతాయి.

3.మందులు

కొన్ని రకాల మందులు,క్రీమ్స్ మరియు కొన్ని రకాల ఎలర్జీలు పిగ్మెంట్ రావటానికి కారణం అవుతాయి.

4.ఒత్తిడి

ఒత్తిడి, ఉద్వేగపూరితమైన షాక్ వంటివి పిగ్మెంట్ రావటానికి కారణాలు కావచ్చు.

5.వ్యాధులు:

కామెర్ల వంటి కొన్ని రకాల వ్యాధుల కారణంగా చర్మం రంగు మారి పిగ్మెంట్ వచ్చే అవకాశం ఉంది.

6.హార్మోన్లు

హార్మోన్లు మరియు యవ్వన దశ మరియు గర్భాదరణ సమయంలో వచ్చే జన్యు మార్పులు హైపర్ పిగ్మెంటేషన్ కి దారి తీస్తాయి.

7.మొటిమలు

మొటిమలు మరియు గడ్డల కారణంగా వచ్చిన నల్లని మచ్చల పలితంగా హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది.

ఎముక‌ల బ‌ల‌హీన‌త‌కు చెక్ పెట్టే అద్భుత‌మైన ఆకుకూర‌లు ఇవే!

తాజా వార్తలు