తెలంగాణలో నాలుగు జిల్లాలని కుదిపేసిన వడగండ్ల వాన

బుధవారం రాత్రి తెలంగాణలో కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలలో ఇదురుగాలులతో కూడిన వడగండ్ల వాన తీవ్ర ప్రభావం చూపించింది.

ఊహించని విధంగా వాతావరణంలో మార్పుల కారణంగా సాయంత్రానికి మబ్బులు కమ్ముకొని ఈదురు గాలుపు, అకాల వర్షం ప్రజలని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి.

ఇదిలా ఉంటే ఈ ఎదురు గాలులతో కూడిన వర్షం వలన పెద్ద పెద్ద వృక్షాలు నేలకూలినట్లు తెలుస్తుంది.అలాగే పలుచోట్ల విధ్యుత్ స్తంభాలు కూలి విద్యుత్ అంతరాయం కలిసినట్లు తెలుస్తుంది.

అదే సమయంలో వడగండ్ల వాన కారణంగా పిందె దశలో ఉన్న మామిడి పంట తీవ్రంగా దెబ్బ తిన్నట్లు తెలుస్తుంది.అదే సమయంలో రాయపట్నం వద్ద చేపలు పట్టేందుకు వెళ్ళిన ఓ జాలారి మృతి చెందినట్లు సమాచారం.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు