బాబు కే ఆంక్షలు పెట్టేస్తున్నారా ? కొత్త తలనొప్పులు మొదలయ్యాయా ?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కొత్త చిక్కొచ్చి పడింది.

ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని మార్చేందుకు కొంతమంది నాయకులు ప్రయత్నిస్తుండడం అధినేత చంద్రబాబు కి మింగుడుపడడంలేదు.

తననే బెదిరించే స్థాయికి కొంత మంది నాయకులు తయారవ్వడం.వారు చెప్పినట్టు చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది.

ఎన్నికల సమయంలో ఈ పరిస్థితులు మాములే అని సర్దుకుందామంటే రోజు రోజుకి ఈ తల నొప్పులు పెరిగిపోతున్నాయి.బాబు ని అంత ఇబ్బంది పెడుతున్న వారు ఎవరు అంటే సిట్టింగ్ ఎంపీలేనట.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో నిమగ్నం అయ్యాడు.ఈ విషయంలో లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థులు అడుగడుగునా జోక్యం చేసుకుంటూ బాబు కే షరతులు విధిస్తున్నారు.

Advertisement

తమ తమ నియోజకవర్గాల పరిధిలో ఉన్న శాసన సభ నియోజకవర్గాలకు తాము సూచించిన అభ్యర్థులకే టికెట్‌లు ఇవ్వాలని అధినేత చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నట్లు పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది.లోక్‌సభ నియోజకవర్గాల్లో తాము విజయం సాధించి కేంద్రంలో టీడీపీ తరపున తాము చక్రం తిప్పాలంటే బాబు మా మాట వినాల్సిందే అంటూ కొత్త రాగం అందుకున్నారు.ఈ జాబితాలో ముందువరుసలో ఉన్నారు అనంతపురం శాసనసభ సభ్యుడు జేసీ దివాకర రెడ్డి.

తన నియోజకవర్గంతో పాటు జిల్లాలోని సిట్టింగ్ శాసనసభ్యులు సగం మందికిపైగా మార్చాలని గత కొంతకాలంగా ఈయన పట్టుబడుతున్నారు.జేసీ పద్ధతి ఇంతేలే అని సరిపెట్టుకుంటుండగానే ఇతర పార్లమెంటు స్థానాల నుంచి కూడా ఇలాంటి డిమాండ్లే వస్తున్నాయి.

విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, కడప, కర్నూలు, గుంటూరు ఇలా చెప్పుకుంటూపోతే అన్ని స్థానాల నుంచి కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదురవుతోంది.

ఏపీలో టీడీపీ విజయం సాధించడం కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాల్లో సీట్లు సంపాధించడమే కీలకం.ఎందుకంటే కేంద్రంలో మళ్ళీ బీజేపీకి అధికారం దక్కితే అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడేది చంద్రబాబు నాయుడే.అందుకే తాము చెప్పిన వారికి అసెంబ్లీ సీట్లు ఇస్తే తాము కూడా సునాయాసంగా గెలుస్తామని టీడీపీ ఎంపీ అభ్యర్థులు బాబుకి వినతితో కూడిన షరతులు విధిస్తున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

దీంతో ఏం చేయాలో పాలుపోని చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో, పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చాడట.తాను ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో కూడా సిట్టింగ్ ఎంపీలే నిర్ణయించేస్తే ఇక నేనెందుకు ? టీడీపీలో ఎప్పుడూ లేని సంప్రదాయాన్ని ఇప్పుడు ఎందుకు మొదలుపెట్టారు అంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడట.

Advertisement

తాజా వార్తలు