దర్శకుడు కోడి రామకృష్ణ మృతి! విషాదంలో చిత్ర ప్రరిశ్రమ!

టాలీవుడ్ దర్శక దిగ్గజం.

వందకి పైగా చిత్రాలకి దర్శకత్వం వహించిన అతి కొద్ది మంది దర్శకుల జాబితాలో చోటు సొంతం చేసుకున్న ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఈ రోజు మృతి చెందారు.

నిన్న సాయంత్రం తీవ్ర అస్వస్తతకి గురి కావడంతో అతని కుటుంబ సభ్యులు అతనిని హాస్పిటల్ కి తరలించారు.తెలుగు తెరపై కుటుంబ కథా చిత్రాలని అద్బుతంగా ఆవిష్కరించిన కోడి రామకృష్ణ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యారు.

తరువాత వెనుతిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఎన్నో అద్బుతమైన చిత్రాలకి తెలుగు ప్రేక్షకులకి అందించారు.ఇక టాలీవుడ్ కి గ్రాఫిక్స్ మాయాజాలం పరిచయం చేసిన మొదటి దర్శకుడుగా కోడి రామకృష్ణ పేరు నిలిచిపోతుంది.

అతను తెరకెక్కించిన అమ్మోరు సినిమా టాలీవుడ్ లో మొదటి గ్రాఫిక్స్ బేస్ సినిమా, తరువాత దేవి కూడా ఆయన కెరియర్ లో మరో అద్బుత చిత్రంగా నిలిచిపోయింది.ఆ సినిమాతోనే ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ని టాలీవుడ్ కి పరిచయం చేసాడు.

Advertisement

ఇక ఆయన కెరియర్ లో అరుందతి సినిమా ఓ ప్రత్యెక స్థానం సంపాదించుకుంటుంది.ఇదిలా వుంటే ప్రస్తుతం సత్యసాయి జీవిత కథని తెరపై ఆవిష్కరిస్తున్న కోడి రామకృష్ణ కొంత కాలం క్రితం పక్షవాతంతో హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకొని మరల మామూలు మనిషి అయ్యారు.

అయితే ఉన్నపళంగా మళ్ళీ ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్ లో చేర్చారు.అయితే ఊహించని విధంగా ఆయన ఈ రోజు హాస్పిటల్ లో ప్రాణాలు విడిచారు.

ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే చిత్ర పరిశ్రమలో ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.కోడి రామకృష్ణ మరణం చిత్ర పరిశ్రమకి తీరని లోటని అభివర్ణించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 15 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు