పుల్వామా దాడి ఎఫెక్ట్! సంచలన నిర్ణయం తీసుకున్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ!

పుల్వామాలో జావాన్లపై పాకిస్తాన్ టెర్రరిస్ట్ లు ఆత్మాహుతి దాడి చేసి 44 మంది జవాన్ల ప్రాణాలు తీసిన సంగతి అందరికి తెలిసిందే.

దీని ప్రతీకారంగా ఇండియా ప్రజల నుంచి పాకిస్తాన్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతూ వుండటంతో పాటు, ఎవరికి వారు తమ దారిలో పాకిస్తాన్ పై ప్రతీకార దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ పై కస్టం సుకం భారీ స్థాయిలో పెంచింది.అలాగే పుల్వామా దాడికి మిస్టర్ మైండ్ గా చెప్పబడుతున్న ఘాజీని హతం చేసింది.

అలాగే ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ హ్యాకర్స్ పాకిస్తాన్ ప్రభుత్వ వెబ్ సైట్స్ ని హ్యాక్ చేసి తమ ప్రతీకారం తీర్చుకున్నారు.ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కూడా పాకిస్తాన్ పై తమ ప్రతీకారానికి సిద్ధం అవుతుంది.

పాకిస్తాన్ ని చెందిన చాలా మంది ఆర్టిస్ట్ లు ఇండియాలో హిందీ సినిమాలలో నటిస్తూ ఇక్కడ ఫుల్ బిజీ అవుతున్నారు.బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పాకిస్తాన్ సినీ నటులకి మంచి అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తుంది.

Advertisement

ఇదిలా వుంటే తాజాగా ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోషియేషన్ ఇప్పుడు పాకిస్తాన్ నటులు, ఇతర టెక్నిషియన్స్ మీద యాక్షన్ కి తీసుకుంది.ఇక పాకిస్తాన్ కి చెందిన ఎవరిని సినిమాలలో తీసుకోమని, వారిపై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.

పాకిస్తాన్ భారతీయ జవాన్లపై చేసిన దాడికి నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనియన్ ప్రతినిధులు తెలియజేసారు.మొత్తానికి పాకిస్తాన్ సినీ కళాకారులపై ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ బ్యాన్ విధించడం ద్వారా పాకిస్తాన్ కి గట్టి షాక్ ఇచ్చింది అని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు