రాత్రి పడుకునే ముందు పెరుగన్నం తింటే ఏమవుతుందో తెలుసా?

వంట చేయడం రానివాళ్లు కూడా ఈజీగా చేసే పని ఏదన్నా ఉందా అంటే పెరుగు తోడు పెట్టడం… వేడి అన్నం వండుకుని ,పెరుగు తోడు పెట్టుకుని,ఆవకాయ నంజుకు తింటే ఆ టేస్టే వేరు.

కానీ రాత్రి పూట పెరుగు అన్నం తినాలి అంటే కొందరు ఆలోచిస్తారు.

దగ్గు, జలుబు వస్తుందని జాగ్రత్త పడతారు.ముఖ్యంగా శీతాకాలంలో అయితే మరీ.అసలు రాత్రి పెరుగు తినొచ్చా.? లేదా అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉంది.

అయితే పెరుగును రాత్రిపూట తినడం వల్ల మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.దీంతో కఫం వస్తుంది.

తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది మంచిది కాదు.ఇలాంటి వారు రాత్రి పూట పెరుగన్నం తినకపోవడమే మంచిది.

Advertisement

పెరుగుతో భోజనం చేసి వెంటనే పడుకుంటే కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.పైన చెప్పుకున్నట్లు పెరుగుకు చల్లబర్చే గుణం ఉంది.

అంటే ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది.

భోజనం జీర్ణం అయ్యేటప్పుడు వేడి పుడుతుంది.దానిని పెరుగు చల్లబర్చడం వల్ల స్లోగా అరుగుదల నడుస్తుంది.కాబట్టి రాత్రి పూట పెరుగు తింటే.కనీసం రెండు గంటల గ్యాప్ ఇచ్చిన తర్వాతే పడుకోవాలి.

లేదంటే సరిగా ఆహారం జీర్ణం అవ్వదు.ఇక దగ్గు, జలుబు సమస్య ఉన్నవారు పెరుగును మధ్యాహ్నం పూట తినవచ్చు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఎముక‌ల బ‌ల‌హీన‌త‌కు చెక్ పెట్టే అద్భుత‌మైన ఆకుకూర‌లు ఇవే!

దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు.అయితే వారు కొద్దిగా చక్కెర లేదా మిరియాల పొడి, నిమ్మరసం కలుపుకుని తినడం ఉత్తమం.

Advertisement

దీంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు దరిచేరవు.

తాజా వార్తలు