రాళ్లదాడి కేసులో మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష !

తమిళనాడు మంత్రి బాలకృష్ణరెడ్డికి ముచ్చటగా మూడేళ్లు జైలు శిక్ష పడింది.1998లో హోసూర్ లో బస్సుపై రాళ్లదాడికి పాల్పడిన కేసులో తమిళనాడు మంత్రి బాలకృష్ణ శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం నేడు (సోమవారం) తీర్పును వెల్లడించింది.

అయితే .ప్రభుత్వ ఆస్తుల తీవ్రనష్టం కలిగించినందుకు న్యాయస్థానం బాలకృష్ణ రెడ్గికి శిక్ష విధిస్తూ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ రాళ్లదాడికి సంబంధించిన కేసులో మొత్తం 108 మంది నిందితులు ఉండగా వారిలో 16 మందిని ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా తెల్చింది.ఇక తీర్పుతో తమిళనాడు మంత్రి బాలకృష్ణరెడ్డి శాసనసభ్యుడి, మంత్రి పదవి కూడా కోల్పోనున్నారు.అయితే ఈ తీర్పుపై బాలకృష్ణరెడ్డి రేపు (మంగళవారం) మద్రాస్ హైకోర్టు లో పిటిషన్ వేసేందుకు సిద్ధం అవుతున్నట్టుగా సమాచారం.

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు