చంద్రబాబు మీద రెచ్చిపోయిన రోజా

ఘాటైన విమర్శలతో విరుచుకుపడే తెలుగు మహిళా నేతల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రోజా ఒకరు.

చంద్రబాబుపై విమర్శించే ఏ చిన్న అవకాశం చిక్కినా తీవ్రస్థాయిలో మండిపడే రోజా.

తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఏపీని పాలిస్తోంది టీడీపీ కాదని.

వివిధ పార్టీల కూటమిగా ఆమె అభివర్ణించారు.ఏపీ సర్కారులో వివిధ రాజకీయ పార్టీల నేతలు ఉన్నారే తప్పించి.

టీడీపీ నేతలు పెద్దగా కనిపించరంటూ కొత్త లెక్కలు చెప్పుకొచ్చారు.

Advertisement
తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందంటూ కొత్తగా సూత్రీకరించిన రోజా లెక్కను చూస్తే.

కాంగ్రెస్ నుంచి వచ్చిన 30 మంది నేతలు ఏపీ అధికారపక్షంలో ఉన్నారని.అలానే బీజేపీ నుంచి వచ్చిన నేతల్ని కూడా తమ నేతలనే భ్రమలో టీడీపీ ఉందని చెప్పుకొచ్చారు.

ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని టీడీపీలో చేర్చుకుంటున్నారని.వీరందరిని తప్పిస్తే.

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ లేదని రోజా విశ్లేషించారు.రోజా మాటల్నే తీసుకుంటే.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతలంతా ఎక్కడి వారు? జగన్ పార్టీతోనే నేతలంతా తమ రాజకీయ ప్రస్థానాన్ని షురూ చేశారు?

Advertisement
ఎవరి దాకానో ఎందుకు? రోజా సంగతి ఏమిటి? ఆమె ఎక్కడి వారు? ఏ పార్టీ నుంచి జగన్ పార్టీలోకి చేరారు? పార్టీ మారటాన్ని తప్పు పట్టటంలో తప్పు లేదు.కానీ.

పార్టీ నేతలంతా ఆ పార్టీకి చెందిన నేతలే ఉండాలని అనుకుంటే.జగన్ పార్టీలోని నేతలంతా ఎక్కడి వారో సమాధానం చెబితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీలో ఉన్న వాళ్లంతా వేర్వేరు పార్టీలకు చెందిన నేతలేనని అభివర్ణించిన రోజా పనిలో పనిగా.టీడీపీ మీద మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ లేదని.అందుకే టీడీపీ జాతీయ పార్టీ ఆఫీసు విజయవాడలో పెట్టుకున్నారని.

హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఓఎల్ ఎక్స్ లో అమ్మకానికి పెట్టినట్లుగా ఎద్దేవా చేశారు.రోజమ్మ మాటలు వినేందుకు బాగానే ఉన్నా.

ఏపీ విపక్షంగా ఉండి.ఇప్పటికి ఏపీలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాటేమిటని ఆంధ్రోళ్లు అడుగుతున్న సూటిప్రశ్నకు రోజా సమాధానం చెబితే బాగుంటుంది.

మొత్తానికి టీడీపీ తమ్ముళ్లకు చిరాకు పుట్టించేలా మాట్లాడటంలో రోజా సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

తాజా వార్తలు