" నాకు ఓటు వేస్తే - పెట్రోల్ 45rs కి ఇస్తా "

మొట్టమొదటి సారి పార్టీ పెట్టి కేవలం ఒకే ఒక్క సీటు అదికూడా తన సీటు గెలిచిన హీరో విజయ్ కాంత్ నెమ్మది నెమ్మదిగా ఓటు బ్యాంకు రాజకీయాలతో తన ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ వెళుతున్నారు.

త్వరలో తమిళ నాట ఎన్నికల నగారా మొగబోతూ ఉండడం తో ఎవ్వరూ ఇవ్వని కొన్ని వినూత్న హామీలు ఇస్తున్నారు విజయ్ కాంత్.

తన పార్టీ ఎన్నికల ప్రణాళిక అంటూ అప్పుడే కొన్ని విషయాలు బయటకి పెట్టారు ఆయన.నేరుగా ఓటర్ల మీద తన ఆఫర్ పనిచేసేలా ఆయన దీన్ని రచించారు.తన పార్టీ కానీ అధికారంలోకి వస్తే లీటరు పెట్రోల్ రూ.45కు.లీటరు డీజిల్ రూ.35కు ఇస్తామన్న హామీని ఆయన తెర మీదకు తీసుకొచ్చారు.

పెట్రోల్.

డీజిల్ మీద విధించే పన్నుల మీద కేంద్ర.రాష్ట్ర సర్కారు అమితంగా ఆధారపడుతున్న వేళ.బహిరంగ మార్కెట్లో ఉన్న పెట్రోల్.డీజిల్ పైన ఉన్న ధరలకు దాదాపుగా లీటరకు రూ.15కు పైనే తగ్గిస్తానంటూ విజయకాంత్ ఇస్తున్న హామీ తమిళనాట హాట్ టాపిక్ అయ్యింది.పెట్రోల్.

Advertisement

డీజిల్ మీద కేంద్ర.రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పన్నులు విధిస్తున్నాయి.

పన్నుల మోత తగ్గించటం ద్వారా.ప్రజలకు నేరుగా ప్రయోజనం కలిగించాలన్నది విజయకాంత్ ఆలోచనగా చెబుతున్నారు.

ఆయన ప్రస్తుతం చెబుతున్న పథకం జనాలకి బాగా ఎక్కేసింది నిత్యం జనాలు ఈ డీజిల్ - పెట్రోల్ ధరల మోత తట్టుకోలేక పోతున్నారు పైగా వీటి వల్లనే సాధారణ ధరలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
Advertisement

తాజా వార్తలు