Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

సింగం 3 రివ్యూ-Singam 3 Movie Review Shruti Haasan,Singam 3,Singam 3 Collections,Singam 3 Movie First Day Talk,Singam 3 Movie Rating,Singam 3 Movie Review,surya

సినిమా: సింగం 3
న‌టీన‌టులు: సూర్య‌, అనుష్క‌, శృతీహాస‌న్‌, ఠాగూర్ అనూప్‌సింగ్‌
సంగీతం: హ‌రీష్ జైరాజ్‌
నిర్మాత‌: జ‌్ఞాన‌వేల్ రాజా
ద‌ర్శ‌క‌త్వం: హ‌రి
రిలీజ్ డేట్‌: 09 ఫిబ్ర‌వ‌రి, 2017

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య – హ‌రి కాంబినేష‌న్ అన‌గానే మ‌న‌కు సింగం సీరిస్ సినిమాలు క‌ళ్ల‌ముందు క‌ద‌లాడేస్తాయి. గ‌తంలో వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన య‌ముడు, సింగం సినిమాలు హిట్ అవ్వ‌డంతో ఈ సీరిస్‌లో మూడో భాగంగా ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2వేల థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఓవ‌రాల్‌గా హ‌రి – సూర్య కాంబినేష‌న్‌లో ఐదో సినిమా. ఈ సినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌ళోకి వెళితే :

బెంగ‌ళూరులో ఉండే క‌ర్నాట‌క హోం మంత్రి (శ‌ర‌త్‌బాబు) ఏపీలో పేరున్న పోలీస్ ఆఫీస‌ర్ న‌ర‌సింహ (సూర్య‌)ను ఓ మిష‌న్ మీద మంగ‌ళూరు డిప్యూటేష‌న్‌పై ర‌ప్పిస్తాడు. అక్క‌డ ఓ క‌మిష‌న‌ర్ హ‌త్య కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన సూర్య హంత‌కుల‌ను ప‌ట్టుకుంటాడు. ఈ కేసు వెన‌క పెద్ద స్టోరీనే ఉంద‌ని తెలుసుకున్న న‌ర‌సింహ‌..క‌మిష‌న‌ర్ హ‌త్య వెన‌క విఠల్ (అనూప్ సింగ్) అనే ఓ పెద్ద వ్యాపారవేత్త ఈ హత్య వెనుక ఉన్నాడని తెలుసుకుంటాడు. ఈ కేసును చేధించే క్ర‌మంలో న‌ర‌సింహ ఆస్ట్రేలియా ఎందుకు వెళ్లాడు ? ఈ కథలో అగ్ని (శృతి హాసన్) ఎవరు? నరసింహ, తన భార్య కావ్య (అనుష్క)కు దూరంగా ఉన్నట్లు ఎందుకు నటిస్తాడు? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

నటీనటుల పెర్ఫార్మెన్స్ :

హీరో సూర్య‌కు పోలీసు పాత్ర‌లు అంటే కొట్టిన పిండే. ఈ సినిమాలో కూడా క‌థ‌కు త‌గ్గ‌ట్టే చాలా ఎగ్రెసివ్‌గా న‌టించాడు. డైలాగ్స్‌, ఫైట్స్‌, యాక్ష‌న్ సీన్ల‌లో ఎమోష‌న్ల‌తో పాటు డైలాగ్స్‌తో సూర్య చింపేశాడు. సూర్య వ‌న్ మ్యాన్ షో అయిపోయింది సింగం 3. శృతీహాస‌న్ అందాల విందుతో పాటు ప్రాధాన్యం ఉన్న రోల్‌లో మెప్పించింది. సూర్య భార్య‌గా అనుష్క పాత్ర‌కంటే శృతి రోల్‌కే ఇంపార్టెన్స్ ఉంది. విల‌న్ ఠాగూర్ అనూప్‌సింగ్ పాత్ర చాలా బ‌లంగా ఉండి సూర్య‌కు ధీటుగా ఉండ‌డంతో విల‌నిజంలోని స్ట్రాంగ్‌నెస్ సినిమాకే హైలెట్ అయ్యింది.

టెక్నికల్ టీం :

సినిమాటోగ్ర‌ఫీ హైలెవ్‌లో ఉంది. సినిమాలో విజువ‌ల్స్ స్కైను ట‌చ్ చేశాయి. యాక్ష‌న్ స‌న్నివేశాలు దుమ్మురేపాయి. ఇక హ‌రీష్‌జైరాజ్ పాట‌ల్లో రెండు మాత్ర‌మే బాగున్నాయి. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ప్ర‌తి సీన్‌లోను భారీ బ‌డ్జెట్ క‌న‌ప‌డింది. ఎడిటింగ్‌కు యావ‌రేజ్ మార్కులు వేయాలి. ఇక ద‌ర్శ‌కుడు హ‌రి సింగం సీరిస్‌లో ముందు రెండు సినిమాల్లో యాక్ష‌న్‌, ఎమోష‌న‌ల్‌తో పాటు కామెడీకి కూడా స్కోప్ ఇచ్చాడు. ఈ సినిమాలో ఎమోష‌న‌ల్‌గా కంటే కూడా యాక్ష‌న్‌కే ఎక్కువ ప్ర‌యారిటీ ఇచ్చాడు. రొటీన్ క‌థ‌కు భారీ యాక్ష‌న్ ట‌చ్ ఇవ్వ‌డంతో ఇది యాక్ష‌న్ ప్రియుల సినిమాగానే మిగిలిపోయింది. మిగిలిన వారికి ఈ సినిమా పూర్తిగా న‌చ్చ‌డం కాస్త క‌ష్ట‌మే.

విశ్లేషణ :

ద‌ర్శ‌కుడు హ‌రి రొటీన్ క‌థ‌కు భారీ యాక్ష‌న్ క‌ల‌రింగ్‌తో ఇచ్చిన సినిమానే సింగం 3. సినిమాలో మిగిలిన అంశాల కంటే ఎక్కువుగా యాక్ష‌న్ మీదే కాన్‌సంట్రేష‌న్ చేయ‌డంతో ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ సినిమాగా సింగం 3 మిగిలిపోయింది. సెంక‌డాఫ్‌లో వ‌చ్చే హెవీ యాక్ష‌న్ స‌న్నివేశాలు రేసీగా ఉండి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇచ్చాయి. ఈ సీరిస్‌లో వ‌చ్చిన య‌యుడు కూడా కాస్త ఇదే స్టైల్లో ఉండ‌డంతో క‌థ‌లో కొత్త‌ద‌నం ఉండ‌దు. కొన్ని చోట్ల లాజిక్‌లు ఊహ‌కే అంద‌లేదు.

ప్లస్ పాయింట్స్ :

* సూర్య ఎన‌ర్జిటిక్ యాక్ష‌న్‌
* ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ ఎలిమెంట్స్‌
* శృతీహాస‌న్ గ్లామ‌ర్‌
* రిచ్ ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్‌

మైనస్ పాయింట్స్ :

* రొటీన్ కథ
* పాట‌లు
* ఎమోష‌న‌ల్‌, కామెడీకి పెద్ద‌గా స్కోప్ లేక‌పోవ‌డం

చివరగా :
సింగం 3 ఓన్లీ ఫ‌ర్ ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్‌

తెలుగుస్టాప్ రేటింగ్ : 2.75/5

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Featured

 • Reviews

  Keshava Movie Review

  By

  చిత్రం : కేశవ బ్యానర్ : అభిషేక్ పిక్చర్స్ దర్శకత్వం : సుధీర్ వర్మ నిర్మాత : అభిషేక్ నామా సంగీతం...

 • Reviews

  Radha Movie Review

  By

  చిత్రం : రాధ బ్యానర్ : శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర దర్శకత్వం : చంద్రమోహన్ నిర్మాత : భోగవళ్ళి బాపినీడు...

 • Reviews

  Babu Baga Busy Review

  By

  చిత్రం : బాబు బాగా బిజీ బ్యానర్ : అభిషేక్ పిక్చర్స్ దర్శకత్వం : నవీన్ మేడారం నిర్మాత : అభిషేక్...

 • Reviews

  Baahubali 2 Movie Review

  By

  చిత్రం : బాహుబలి 2 – ది కంక్లూజన్ బ్యానర్ : అర్కా మీడియా దర్శకత్వం : ఎస్ ఎస్ రాజమౌళి...

To Top