ఆ సినిమా హిట్ అయితే రామ్ చరణ్ అవకాశమిస్తాడు

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మూస చిత్రాల చట్రంలోంచి బయటకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.బ్రూస్ లీ ఫ్లాప్ ప్రభావం చరణ్ పై గట్టిగా పడింది.

అందుకే ఇకనుంచి దర్శకుల రేంజ్ ని కాకుండా, వారు తీసుకొచ్చే కథపైనే నమ్మకం పెట్టుకోవాలని చరణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అందుకే తని ఒరువన్ లాంటి కొత్త తరహా చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నాడు చెర్రి.

ఇక మొదటి చిత్రం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకర్షించాడు దర్శకుడు మేర్లపాక గాంధీ.ఈ యువ దర్శకుడు యూవి క్రియేషన్స్ తో కలిసి శర్వానంద్ హీరోగా ఎక్స్‌ప్రెస్ రాజా ని తెరకెక్కించిన విషయం తెలిసిందే.

చరణ్ కి మంచి స్నేహితుడైన శర్వానంద్ రికమండేషన్ తో చెర్రికి ఓ కథ వినిపించాడంట గాంధీ.చరణ్ కి కథ నచ్చడంతో అవకాశమిస్తాను కాని ఎక్స్‌ప్రెస్ రాజా ఫలితాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పాడంట.

Advertisement

యూవి క్రియేషన్స్ కి కమిట్‌మెంట్స్ ఇచ్చాడు చరణ్.జనవరి 14న విడుదల అవుతున్న ఎక్స్‌ప్రెస్ రాజా హిట్ అయితే, చరణ్ - గాంధీ కాంబినేషన్ లో వచ్చే చిత్రాన్ని యూవి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది.

ఇంతకీ ఆ ముంబై భామలు తెలుగు సినిమాలు చేస్తారా?
Advertisement

తాజా వార్తలు