ఈ 8 రాష్ట్రాల్లో ఆదివారాలు పెట్రోల్ బంద్ .. జాగ్రత్త

పెట్రోల్ రెట్ల ఎగుడుదిగుడుతో ఇబ్బందిపడుతున్న జనాలపై మరో పెద్ద బాంబు పడనుంది.

మళ్ళీ క్యాష్ దొరక్క నరకం చూస్తున్న మహానగర ప్రజలు, ఇకనుంచి నోట్ల అవసరం లేకుండా కార్డులతోనే ఫుల్ ట్యాంకులు కొట్టించుకోవాలి.

మే 14, ఈ తేది గుర్తుపెట్టుకోండి.ఎందుకంటే మే 14 నుంచి మొదలు, ఆదివారాలు మీకు పెట్రోల్ దొరకదు.

అన్ని కంపెనీల, చిన్నాచితకా పెట్రోల్ అవుట్ లెట్స్ మూసేసి ఉంటాయి.దీన్ని జోకులా తీసుకోకండి .ఇదేమి ఏప్రిల్ ఒకటవ తారీఖు కాదు.నిజంగానే ఈ కొత్త ప్లాన్ అమలు లోకి రానుంది.

ముందుగా 8 రాష్ట్రాల్లో ఆదివారం పెట్రోల్ బంకుల బంద్ మొదలవుతోంది.ఆ 8 రాష్ట్రాలు ఏవంటే .తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళా, కర్ణాటక, హర్యానా, పుదిచేర్రిలో మే 14 నుంచి మొదలు, ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసేసి ఉంచబోతున్నారు.ఇలా ఎందుకు అనే కదా మీ డౌటు? ఆయిల్ ని ఆదా చేయడం కోసం అంట.ఇటివలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కి బాత్ ప్రోగ్రాంలో మాట్లాడుతూ, ఆయిల్ ఆదా గురించి తన మనసులో మాట చెప్పారు.దాంతో పెట్రోల్ డీలర్స్ అంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

నిజానికి ఆదివారాలు పెట్రోల్ బంద్ అనే ఆలోచన డీలర్లకి అయిదారు ఏళ్ల నుంచే ఉందట.కాని కంపెనీలు అందుకు సహకరించకపోవడంతో వాయిదా వేసుకుంటూ వచ్చారు.

ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి అండ దొరకడంతో తమ ప్లాన్ ని ఆచరణలో పెడుతున్నారు.ఇలా చేస్తే నష్టాలు రావా అంటే వస్తాయి .ఒక్క తమిళనాడులోనే ప్రతి ఆదివారం 150 కోట్ల గిరాకి పోతుంది.కాని ఆదివారాలు ఎలాగో 40% గిరాకి తక్కువగా ఉంటోందట.

కాబట్టి పెద్ద ప్రభావం ఏమి పడదు అంటున్నారు.సాధారణంగా సెలవుల్లో 15 మంది ఒక్కో బంకులో పనిచేసేవారట.

కాని ఇకనుంచి ఒకరే ఉంటారట.అది కూడా ఎవరకైనా ఎమర్జెన్సీలో పెట్రోల్ అవసరం పడితే అందించడానికి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఈ కొత్త ఆలోచన మీద దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.ఆదివారాలు వ్యాపారస్తులు తమ సరుకు ఎలా తెచ్చుకుంటారు, జనాలు ప్రయాణాలు ఎలా చేస్తారు అంటూ సోషల్ మీడియా ప్రజానీకం ప్రధానమంత్రికి సందేశాలు పంపుతోంది.

Advertisement

మరి ఈ ప్లాన్ నిజంగానే అమలుపరుస్తారా ? ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుంది అనే విషయం మే 14 తరువాతే తెలుస్తుంది.

తాజా వార్తలు