నోకియా ఫోన్ .. బుల్లెట్ నుంచి ప్రాణాల్ని కాపాడింది

స్మార్ట్ ఫోన్ యుగంలో సరిగా అప్డేట్ అవకుండా, కంపెనీ మూసేసుకుంది కాని, ఒకప్పుడు నోకియాని మించిన ఫోన్ లేదు.

మనలో చాలామంది మొట్టమొదట వాడిన ఫోన్ నోకియా.

ఆ సమయంలో బ్యాటరీ బ్యాకప్ అని, స్క్రీన్ పిక్సెల్స్ లాంటి స్పెసిఫికేషన్స్ చాలామందికి తెలియదు.ఫోన్ అంటే నోకియా, అదే ఫోన్ ఎందుకు అంటే కిందపడినా పగలదు అనే ధీమా.

అంతేగా, ఎంత బలంగా ఉండేవి నోకియా మొబైల్స్.రెండుమూడు అంతస్తుల మీది నుంచి కిందపడ్డా, ఫోన్ కి ఏం జరగదు అనే నమ్మకం ఉండేది.

ఇప్పుడు ఓ నోకియా ఫోన్ ఓ మనిషి ప్రాణాల్ని కాపాడింది.అది కూడా ఓ బుల్లెట్ ని అడ్డుకోని.

Advertisement

నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం.ఏదో బుల్లెట్ ఫ్రూఫ్ జాకేట్ లేదా గ్లాస్ లాగా ఓ బుల్లెట్ ని అడ్డుకోని ఓ మనిషిని కాపాడింది.ఈ వింత ఆఫ్గానిస్తాన్ లో జరిగిందట.2013 లో విడుదలైన నోకియా 310 మోడల్ ఫోన్ ఓ బుల్లెట్ ని ఆపగలిగిందని ఆ ఫోన్ రూపకర్త, నోకియా విలీనమైన మైక్రొసాఫ్ట్ జనరల్ మేనేజర్ పీటర్ స్కిల్మన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.

నోకియా ఫోన్ గొప్పతనం ఒక్కసారిగా అందరికి గుర్తుకువచ్చింది.నోకియా ఫోన్లని సైనికులు, పోలీసులు బుల్లెట్ ఫ్రూఫ్ జాకేట్ లాగా వాడుకోవాలని జోకులు పేలుస్తున్నారు నెటిజన్స్.

Advertisement

తాజా వార్తలు