జై ల‌వ కుశ‌లో " N " స్పెష‌ల్ మీనింగ్ ఉందా..!

దివంగ‌త మాజీ సీఎం నంద‌మూరి రామార‌వు త‌న‌యుడు, నందమూరి హరికృష్ణ చాలా హ్యాపీగా ఉన్నారు.ప్ర‌స్తుతం ఆయ‌న ఇద్ద‌రు కుమారులు కాంబోలో ఓ సినిమా తెర‌కెక్కుతోంది.

హ‌రికృష్ణ కుమారులు ఎన్టీఆర్ హీరోగా, క‌ళ్యాణ్‌రామ్ నిర్మాత‌గా బాబి ద‌ర్శ‌క‌త్వంలో జై ల‌వ కుశ సినిమా తెర‌కెక్కుతోంది.ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

ఈ సినిమా షూటింగ్ స్పాట్‌ను హ‌రికృష్ణ సంద‌ర్శించి ఎన్టీఆర్‌తో కాసేపు ముచ్చ‌టించారు.ఎన్టీఆర్‌-హ‌రికృష్ణ షూటింగ్ స్పాట్‌లో మాట్లాడుతుండ‌గా ఆ టేబుల్‌పై ఉన్న నేమ్ ప్లేట్‌పై ‘" N " లవ కుమార్‌’ అనే పేరు కనిపిస్తోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నారనీ, ఓ పాత్ర పేరు ‘జై’, మరో పాత్ర పేరు ‘లవ’, మూడో పాత్ర పేరు ‘కుశ’ అని ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.ఇక ఇప్పుడు ఈ నేమ్ ప్లేట్‌పై ఉన్న ‘ " N " లవకుమార్‌’ పేరు చూస్తోంటే ఆ వార్తలు నిజమే అనిపిస్తోంది.

Advertisement

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా ల‌వకుమార్ ముందు ఉన్న " N " కు మీనింగ్ ఏంటి నంద‌మూరి అనేనా అన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.త‌న ఒరిజిన‌ల్ ఇంటి పేరు నంద‌మూరినే త‌న సినిమాలో క్యారెక్ట‌ర్‌కు కూడా ఇంటిపేరుగా మార్చేశార‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

ఇక ఈ సినిమాను ఆగ‌స్టు 12న రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు