గుండెపోటుని అడ్డుకునే ఈజీ విధానం

సమస్య పెద్దగా అయ్యాక, ప్రయత్నాలు మన తాహతుకి మించి చేయడం కన్నా, సమస్య మొదలవకుండా, చిన్ని చిన్ని మార్గాలతోనే పెద్ద పెద్ద సమస్యలను అడ్డుకుంటే బెటర్.

అలాంటి ఓ పెద్ద సమస్యే గుండేపాటు.

దాన్ని అడ్డుకునే చిన్ని ఆయుధం గుడ్డు.అవును, కోడిగుడ్డు.

సగటున ఒక పెద్ద సైజ్ కోడిగుడ్డులో ఆరు గ్రాముల హై క్వాలిటి ప్రొటీన్, రెండురకాల యాంటిఆక్సిడెంట్స్, విటమిన్ ఏ,డి,ఈ ఉంటాయి.ఇలా న్యూట్రింట్స్ సంపన్న ఆహారం కాబట్టే, రెగ్యులర్ గా ఉడకబెట్టిన గుడ్డుని తీసుకోవడం వలన గుండెపోటు వచ్చే ప్రమాదం 12% తగ్గుతుందట.

ఈ విషయంపై అమెరికాలో ఓ ప్రోఫేసర్ డామినిక్ అలెగ్జాండర్ కొన్నేళ్ళుగా రిసెర్చి చేసారు.ఫలితాలు వెల్లడించిన ప్రొఫేసర్ " గుడ్డులో యాంటిఆక్సిడెంట్ ప్రపార్టీస్ బాగా ఉండటం వలన ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు ఇంఫ్లేమేషన్ ని అడ్డుకుంటాయి.

Advertisement

గుడ్లలో ప్రొటీన్ కూడా బాగా దొరకడంతో ఇవి బ్లడ్ ప్రెషర్ ని కూడా కంట్రోల్ లో ఉంచుతాయి" అంటూ చెప్పుకొచ్చారు.ఈ రిసెర్చి ఏదో చిన్నగా జరగలేదు లేండి.

మూడు లక్షలమందికి డైట్ లో గుడ్లని రోజూ అందిస్తూ, కొన్నేళ్ళపాటు పరీక్షలు చేశారు.ఆ తరువాత జర్నల్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రీషన్, అమెరికన్ ఎగ్ బోర్డ్ ఈ ఫలితాలనయ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు