సీనియర్ నటి, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల గతకొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ లావాదేవీలు చేస్తున్నారు.అలాంటి బిజినెస్ పనుల్లోనే విజయనిర్మల శ్రీనివాస రాజు అనే బిజినెస్ మెన్ కి కోటి రూపాయల అప్పు ఇచ్చారట.
ఇదంతా జరిగి చాలాకాలమైనా, ఆ వ్యక్తి ఇంకా తీసుకున్న డబ్బు తిరిగివ్వలేదట.
వడ్డీ కూడా సరిగా చెల్లించకపోగడంతో విజయనిర్మల తన డబ్బు తిరిగి ఇవ్వాలని అడగగా, ఆ వ్యాపారవేత్త దగ్గరి నుంచి సానుకూలమైన సమాధానం రాలేదట.
సమయం గడచిపోతున్నా, తన డబ్బు తిరిగిరాకపోవటంతో జుబ్లీ హిల్స్ పోలిస్ స్టేషన్ లో సదరు వ్యక్తిపై, అతని అసోసియేట్ పై కేసు వేశారు విజయనిర్మల.కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు, త్వరలోనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారట.
అప్పులు ఎగవేయటం రోజూ వార్తల్లో చూసే విషయమే అయినా, మహేష్ బాబు లాంటి పలుకుబడి ఉన్న వ్యక్తితో సంబంధం ఉన్న విజయనిర్మలకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవడం నిజంగా ఆశ్చర్యకరం.







