వక్షోజాలు చిన్నగా ఉంటే పాలు తక్కువగా ఉత్పత్తి అవుతాయా?

మన మానసిక తత్వం మన చేతిలో ఉంటుంది కాని మన శరీర తత్వం మాత్రం మన జీన్స్ లో ఉంటుంది.

ఆ శరీరాన్ని కాపాడుకుంటామా, మెరుగుపరుచుకుంటామా, అది మన చేతుల్లోనే ఉంది.

ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేక, లేదంటే అవతలి వ్యక్తిలో వంకలు పెట్టడం సరదాగా అనిపించి మనుషులు ఇతరులై పిచ్చి పిచ్చి కామెంట్స్ పాస్ చేస్తుంటారు.నీ ముక్కు అలాగా ఉంది, నీ మూతి ఇలాగా ఉంది, నీ రంగు అలా ఉంది, ఏదో సినిమాలో అన్నట్లు సగం ప్రపంచం బాగుపడకపోవడానికి ఇవే కారణం.

ఇలాంటి అవమానాలు ఇంకా ఎక్కువ చూస్తారు వక్షోజాల సైజు చిన్నగా ఉన్న మహిళలు.అర్థం చేసుకోలేని భర్త దొరక్కపోతే వీరికి సెక్స్ లైఫ్ లో ఎలాగో ఇబ్బందులు ఉంటాయి.

చిన్న సైజు వక్షోజాలపై ఉన్న మరో అపోహా కూడా వీరు తమని తాము చిన్నగా చూసుకునేలా చేస్తుంది.ఆ అపోహా ఏమిటంటే, వక్షోజాలు చిన్నగా ఉంటే పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది, బిడ్డకు సరిపడా పాలు ఇవ్వలేదు తల్లి.

Advertisement

ఈ అపోహా నిజంహా అపోహే.
ఒక స్త్రీ గర్భవతి అయిన తరువాత హార్మోన్స్ లో మార్పుల వలన మామ్మరి గ్లాండ్స్ మేలుకోని పాల ఉత్పత్తి మొదలుపెడతాయి.

పాల ఉత్పత్తి మొదలయ్యాక వక్షోజాల సైజు కొంచెం పెరిగినా, ఆ సైజుకి, పాల ఉత్పత్తికి సంబంధం ఉండదు.సైజు ఎక్కువ ఉంటే ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతాయి, తక్కువ ఉంటే తక్కువ అవుతాయి అనడం ఎలా ఉంటుంది అంటే, పురుషాంగం పెద్దగా ఉంటే ఎక్కువ వీర్యం ఉత్పత్తి అవుతుంది, తక్కువగా ఉంటే తక్కువ ఉత్పత్తి అవుతుంది అన్నట్లుగా ఉంటుంది.

సైజు పాల ఉత్పత్తిని నిర్ణయించదు.డైట్, లైఫ్ స్టయిల్ నిర్ణయిస్తాయి.


తల్లికి రొమ్ము క్యాన్సర్‌ ఉండటం, మద్యంపానం, ధూమపానం అలవాట్లు ఉండటం, జంక్ - క్యాన్డ్ ఫుడ్స్ తినడం, సరిగా నిద్రపోకపోవడం .ఇలాంటి అలవాట్లు పాల ఉత్పత్తిని తగ్గిస్తాయి.సైజు తగ్గించదు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
అండాశయ క్యాన్సర్ ఎందుకు వ‌స్తుంది.. దీని ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయో తెలుసా?

అందుకే ఇలాంటి అపోహలు వదిలేసి పౌష్టికాహారం మీద దృష్టి పెట్టాలి తల్లులు.ప్రపంచం ఎన్నో మాట్లాడుతుంది, అన్నీ పట్టించుకోకూడదు.

Advertisement

తాజా వార్తలు