పవన్ కళ్యాణ్ చేసిన మోసంతో దారుణంగా నష్టపోయిన హీరోయిన్

అనిషా అంబ్రోస్ .ఇప్పటికీ మనకు పెద్దగా పరిచయం లేని పేరు.

అలాంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం కొట్టేసింది.

కాని ఇలా వచ్చిన అవకాశం అలా వెళ్ళిపోయింది.

పవన్ కళ్యాణ్ మాట తప్పాడు.దాంతో ఈ హీరోయిన్ పాపం, చాలా దారుణంగా నష్టపోయింది.

ఇంతకి పవన్ కళ్యాణ్ కి ఈమెకి ఏమిటి సంబంధం? ఇదే కదా మీ డౌటు.సర్దార్ గబ్బర్ సింగ్ .ఈ సినిమాకి మొదట దర్శకుడు సంపత్ నంది.పాపం పవన్ కళ్యాణ్ మాట మీద రెండేళ్ళు మరో సినిమా ముట్టుకోకుండా ఎదురుచూసాడు.

Advertisement

కాని మాట తప్పిన పవర్ స్టార్ ఆ అవకాశం బాబి చేతిలో పెట్టాడు.సంపత్ నంది సంగతి వేరు.అప్పటికి ఏమైంది ఈ వేళ, రచ్చ లాంటి హిట్ సినిమాలు ఉన్నాయి.

అందుకే పెద్ద గ్యాప్ వచ్చిన రవితేజతో బెంగాల్ టైగర్ తీసే అవకాశం వచ్చింది.అలాగే ఇప్పుడు గోపిచంద్ తో గౌతమ్ నంద అనే సినిమా సెట్స్ మీద ఉంది.

కాని అనీషా అంబ్రోస్ ఒక చిన్న నటి.తేలుకోలేకపోయింది.విషయం ఏమిటంటే, సర్దార్ గబ్బర్ సింగ్ లో మొదట కాజల్ కాదు కథానాయిక.

అనీషానే అనుకున్నారు, ఫిక్స్ చేసారు, చివరకి మరో సినిమా ఒప్పుకోకూడదని కండీషన్ కూడా పెట్టారు.పాపం అనీషా ఎన్నో కలలు కన్నది పెద్ద హీరోయిన్ అయిపోతానని.కాని పవర్ స్టార్ మళ్ళీ మాట తప్పాడు.అనీషాని కారణం కూడా చెప్పకుండా తీసేసి కాజల్ ని తీసుకొచ్చాడు.8 నెలలు పవన్ కోసం మరో సినిమా ఒప్పుకోకుండా, కనీసం ప్రయత్నం కూడా చేయకుండా ఉన్న అనీషా, ఆ తరువాత తేలుకోలేకపోయింది.ఆ విషయాలన్ని స్వయంగా తానే మీడియా ముందు బయటపెట్టింది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఇంతకీ ఆ ముంబై భామలు తెలుగు సినిమాలు చేస్తారా?

మొత్తానికి, ఇన్నిరోజులకి ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్ అనే సినిమా తన చేతికి చిక్కింది.మరీ ఈ సినిమా అయినా అమ్మడి జాతకాన్ని మార్చుతుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు