8 ఆరోగ్య సమస్యలకి 8 జ్యూసులు

ప్రతివ్యక్తి పెద్ద సమస్యలతోనే బాధపడటం లేదు.అందరికి షుగర్, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులే రావట్లేదుగా.

 8 Juices For 8 General Health Problems-TeluguStop.com

కొన్ని ఆరోగ్య సమస్యలుంటాయి.వాటిని పెద్దవి అనలేం, అలాగే చిన్నవి అని పట్టించుకోకుండా ఉండలేం.

ఎందుకంటే ఇవి రోజువారీ జీవితంలో ఇబ్బందులు సృష్టిస్తాయి.వాటిలో కొన్ని ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారం మార్గాలు ఇప్పుడు చూద్దాం!

* కీళ్ళనొప్పులు ఇంట్లో ఒకరికైనా ఉంటాయి.

వయసు పైడినవారిలో చాలా సామన్యంగా కనిపించే సమస్య ఇది.దీని నుంచి ఉపశమనం పొందాలంటే రోజు పైనాపిల్, నిమ్మ, ఆకుకూరలు, క్యారట్ కలిపిన జ్యూస్ ని తాగాలి.

* ఆస్తమా లక్షణాల నుంచి విముక్తి పాలకూర, వెల్లుల్లి, ఆపిల్, నిమ్మతో తయారుచేసిన జ్యూస్ తాగాలి.

* అల్సర్ తో బాధపడేవారు, సమస్య తీవ్రతను బట్టి, డాక్టర్ ని సంప్రదించాక పైనాపిల్, నిమ్మ, ఆకుకూరలు, క్యారట్ కలిపిన జ్యూస్ ని తాగాలి.

* అజీర్ణముతో ఇబ్బందిపడేవారు పుదీనా, నిమ్మ, క్యారట్, పైనాపిల్ తో జ్యూస్ తయారుచేసి ప్రయత్నించవచ్చు.

* మలబద్ధకంతో సతమతమవుతున్నవారు ఆపిల్, క్యాబేజీ, క్యారట్ కలిపిన జ్యూస్ తాగే అలవాటు చేసుకుంటే మంచిది.

* ఊరికే అలసటగా అనిపిస్తోందా ? పాలకూర, నిమ్మ, బీట్ రూట్, క్యారట్ కలిపిన జ్యూస్ మీకు పనికివస్తుంది.

* తలనొప్పి బాధపెడుతోంటే అల్లం, దోసకాయ, ఆపిల్, కాలే లీఫ్ తో చేసిన జ్యూస్ తాగితే ఉపయోగకరం.

* ఒత్తిడి ఎక్కువైనప్పుడు దానిమ్మ బాగా పనికివస్తుంది.అలాంటప్పుడు దానిమ్మ రసం తాగితే కొంత ఉపశమనం దొరుకుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube