అవకాశాల కోసం నన్ను పడుకోమన్నారు .. అంటున్న తెలుగు హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడుకోవాలంటే రోజులు కాదు, సంవత్సరాల కొద్ది మాట్లాడుకోవచ్చు.

ఎందుకంటే కాస్టింగ్ కోచ్ అనేది దశాబ్దాలుగా ఓ పరంపరలా ఉంటూ వస్తోంది సినిమా ఇండస్ట్రీలో.

ఇది రంగుల ప్రపంచం, లక్షలు, కోట్లతో వ్యవహారం, అదీకాక గ్లామర్ ప్రపంచం.ఎంతైనా హార్మోన్స్ ఉత్పత్తి అవుతున్న మనుషులే కదా, అందుకే కోరికల మీద కంట్రోల్ ఉండటం కష్టమైన విషయం.

అవకాశం ఇచ్చే హోదా ఉన్నవారికి కోరిక ఉంటుంది, ఈ ప్రపంచంలో ఎదగాలి అనుకునేవారికి ఆశ ఉంటుంది.ఆ ఆశల కోసం ఎదుటివ్యక్తి కోరిక తీర్చేందుకు వెనుకాడరు కొందరు హీరోయిన్లు.

అందరు అలానే ఉండరు, అందరు అలానే అడగరు.ఉన్న కొద్ది మంది వల్లే, ఇండస్ట్రీ పేరు బద్నాం అవుతుంది.

Advertisement

కాస్టింగ్ కోచ్ అనుభవం తనకి కూడా అయ్యిదని చెబుతోంది శ్రద్ధ దాస్.కెరీర్ తొలినాళ్ళలో తనని చాలామంది చాలా డిమాండ్ చేసారని, కాని ఎవరికీ లొంగలేదని శ్రద్ధ చెబుతోంది.

తానూ లొంగకపోయే సరికి, తనని ఎన్నో ప్రాజెక్ట్స్ నుంచి బయటకి తీశేసారని, అప్పటికే షూట్ జరిగితే ఎడిటింగ్ లో తన పాత్ర నిడివి తగ్గించారని, కొన్ని సినిమాల్లో తానూ నటించినా, తన పాత్ర పూర్తిగా లేకుండా చేసారని శ్రద్ధ చెప్పుకొచ్చింది.కాస్టింగ్ కోచ్ అటు బాలివుడ్ లోనూ, ఇటు దక్షిణాది ఇండస్ట్రీలలోనూ సమానంగా ఉందని అభిప్రాయపడింది శ్రద్ధ.

తనకు అలాంటి చేదు అనుభవాలు అక్కడ, ఇక్కడా జరిగాయి అంట.బోల్డ్ గా ఇలాంటివి నేను ఎదుర్కొన్నాను అని చెప్పనైతే చెప్పింది కానీ, ఇంకొంచెం బోల్డ్ గా వెళ్లి పేర్లు కూడా బయటపెడితే బాగుండేది ఏమో.

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?
Advertisement

తాజా వార్తలు