ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్‌ లో యువీ ఆడనున్నాడా...?!

టీమిండియా నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత యువరాజ్ సింగ్ ఇతర దేశాల్లో జరిగే క్రికెట్ లీగ్స్ లో పాల్గొనడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు అర్థమవుతోంది.

ఇకపోతే తాజాగా ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియా దేశంలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ (BBL) లో ఆడేందుకు యువరాజ్ సింగ్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇదే విషయంపై యువరాజ్ సింగ్ బిసిసిఐ నుండి గ్రీన్ సిగ్నల్ పొందినట్లు కూడా సమాచారం.గత సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పిన తర్వాత యువరాజ్ సింగ్ మొదటిసారిగా అబుదాబి వేదికగా జరిగిన గ్లోబల్ టీ- 20 కెనడా టీ 20 లీగ్ లో పాలుపంచుకున్నాడు.

దీంతో ఓవర్ సిస్ లో టి20 లీగ్ ఆడిన తొలి ఆటగాడిగా యువరాజ్ సింగ్ రికార్డు సాధించాడు.ఇకపోతే 2020 డిసెంబర్ 3 నుండి 2021 ఫిబ్రవరి 6 వరకు తదుపరి బిగ్ బాస్ లీగ్ ఆస్ట్రేలియా లో జరుగుతున్న నేపథ్యంలో అందులో ఆయన పాల్గొంటారని అతని మేనేజర్ జాన్సన్ వార్న్ తెలియజేశారు.

ఇందుకు సంబంధించి వారు క్రికెట్ ఆస్ట్రేలియా తో కూడా చర్చలు చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.ఇదివరకే యువరాజ్ సింగ్ వెస్టిండీస్ లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా పాల్గొంటారని అనేక వార్తలు ప్రచారం అయ్యాయి.

Advertisement

కాకపోతే అలాంటివి ఏమి జరగకపోవడంతో అతని అభిమానులు కాస్త నిరాశ చెందారని చెప్పవచ్చు.ఇకపోతే ఇప్పుడు భారత మాజీ స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ పై ఎంత వరకు ఆస్ట్రేలియా క్రికెట్ క్లబ్స్ ఆసక్తి చూపుతాయో వేచి చూడాలి మరి.ఈ మధ్య కాలంలో అనేక మంది భారత మాజీ క్రికెటర్ విదేశాల్లో జరిగే లీగ్ మ్యాచ్లలో పాల్గొనడం సర్వసాధారణమైపోయింది.ప్రపంచవ్యాప్తంగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్తాన్ ఇలా ప్రతి ఒక్క దేశం వారి వారి దేశాలలో మన దేశంలో నిర్వహించే ఐపిఎల్ లాగా టి20 మ్యాచ్ లను నిర్వహిస్తున్నాయి.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు