నిత్య కల్యాణం గారు ! పవన్ పరువు తీసిన వైసీపీ ఎంపి

ట్విట్టర్ ద్వారా తమ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ఉంటారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి.నిత్యం ఏదో ఒక ట్విట్ తో తమ ప్రత్యర్థుల మీద విమర్శలు చేయకపోతే విజయసాయికి నిద్ర పట్టదో ఏమో కానీ అందుకు ట్విట్టర్ ను బాగా వాడేసుకుంటున్నారు.తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ పై తన ప్రతాపం చూపించారు విజయసాయి.

 Ysrcp Mp Vijayasaireddy Coments On Pavan-TeluguStop.com

‘జనసేన పార్టీ కార్యకర్తలకు మీరిచ్చే సందేశం ఇదేనా నిత్యకళ్యాణం గారూ, మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేమిటి ? ఇష్టమైతే మీరూ మూడు పెళ్లిళ్లు చేసుకోండి తప్పేమిటి ? ఇష్టమైతే ఎవరు ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవచ్చు అని సలహా ఇస్తున్నారు.ప్యాకేజీ స్టార్లు, వివాహ వ్యవస్థ అంటే గౌరవం లేని వారు ప్రజా నాయకులు ఎప్పటికీ కాలేరు.అతిగా ఊహించుకోకండి పవన్ ను ఉద్దేశించి విజయసాయి ట్విట్ పెట్టారు.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు మీద విజయసాయి అదే స్థాయిలో వెటకారం చేశారు.చంద్రబాబు కొడుకు నారా లోకేష్ నాలుగు గంటలు అల్పాహారం మానేసాడు.

అదే దీక్ష అన్నాడు.ఇప్పుడేమో తండ్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్రతం చేస్తారట.

నిరాహార దీక్ష అనే మాటలను తండ్రి కొడుకులు ఇద్దరూ అపహాస్యం చేస్తున్నారు.అంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube