మోదీతో మరో వైసీపీ ఎంపీ భేటీ ? గోడ దూకేస్తారా ?

ఏపీ అధికార పార్టీకి నిద్ర లేకుండా చేస్తున్నారు ఆ పార్టీ ఎంపీలు.

ఏపీలో ప్రతిపక్ష టీడీపీని కంగారు పెట్టుస్తూ ఆ పార్టీ నాయకులతో రాజీనామా చేయిస్తూ వస్తున్న వైసీపీని సొంత పార్టీ ఎంపీలే ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మోదీతో భేటీ అవ్వడం , ఆ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుండడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.దీంతో ఆయన కాస్త వెనక్కి తగ్గినట్టే తగ్గి ఆ తరువాత బీజేపీ పార్లమెంటరీ ఆఫీస్ లో ప్రత్యక్షం అవ్వడం వైసీపీని ఆందోళనకు గురిచేసింది.

ఈ వ్యవహారం ఇలా ఉండగానే తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలవడం కలకలం రేపుతోంది.ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని, పొగాకు బోర్డు సభ్యుల నియామకంలో స్థానికులకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసేందుకు మాత్రమే ప్రధానిని కలిశానని ఆయన చెబుతున్నా విజయసాయిరెడ్డి అనుమతి లేకుండా ఎవరూ మోదీ, అమిత్ షాలను కలవడానికి కుదరదని పార్లమెంట్‌ సమావేశాలకు ముందే ఎంపీలకు జగన్‌ వార్నింగ్ ఇచ్చినా ఇలా ఎవరూ లెక్కచేయకుండా బీజేపీతో టచ్ లోకి వెళ్లడం కలకకాలం సృష్టిస్తోంది.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు