అమరావతిపై రాష్ట్రపతికి వైసీపీ లేఖ

మూడు రాజధానులు ఏర్పాటు పై ప్రభుత్వం ఎంత దృఢ నిశ్చయంతో ఉందో అంతే రేంజ్ లో ప్రతిపక్షం తెలుగుదేశం కూడా రాజధాని అమరావతి నుంచి తరలించవద్దు అంటూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

దీనిపై ఇప్పటికే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలను టీడీపీ రెచ్చగొడుతోందని వైసిపి ఆరోపిస్తోంది.

ముఖ్యంగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఎప్పుడూ లేని విధంగా తన భార్య భువనేశ్వరిని అమరావతి ఉద్యమంలోకి తీసుకువచ్చి దీనికి మరింత ఊపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ సమస్య రోజు రోజుకు మరింత బిగుస్తుండడంతో వైసీపీ కూడా ఏదో విధంగా ఈ వ్యవహారాన్ని తేల్చేయాలని చూస్తోంది.

దీనిలో భాగంగానే మూడు రాజధానుల విషయంపై వైసిపి శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు రాష్ట్రపతికి లేఖ రాశారు.అమరావతిని గత టిడిపి ప్రభుత్వం రాజధానిగా ప్రకటించడం రాజ్యాంగానికి విరుద్ధం అని రాష్ట్రపతి ప్రకటించాలని ఆ లేఖ ద్వారా ఆయన కోరారు.

రాజ్యాంగం సూచించిన మేరకు పరిపాలనా వ్యవహారాలు సాగాల్సి ఉందని, రాష్ట్రం విడిపోయిన తరువాత రాజధాని నిర్మాణంతో పాటు ఇతర అంశాలను అధ్యయనం చేసేందుకు గత ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీని నియమించిందని, కానీ ఆ కమిటీ ఇచ్చిన నివేదికను టిడిపి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.కేవలం పార్టీ నాయకులతో కమిటీని నియమించి ఆ కమిటీ చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకున్నారని ధర్మాన ఆ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

రాజధాని ఒకే చోట ఏర్పాటు చేయాలనుకున్నా గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాలు అందుకు అనువైనవి కాదని నిపుణుల కమిటీ స్పష్టంగా తెలిపినా అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ విషయంపై మీరు స్పందించాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు