జనసేన వీక్నెస్ మీద కొడుతున్న వైసిపి?

సమాజం కులాలుగా విడిపోయి చాలా కాలం అవుతుంది.ముఖ్యంగా ఉమ్మడి ప్రయోజనాల గురించి ఆలోచించే యువత ఇప్పుడు ధుర్భిణి వేసి వెతికినా కనిపించదు.

సామాజికంగా ఇప్పుడు కులాలు వారి సమీకరణాలే ప్రదాన పాత్ర పోషిస్తున్నాయి .అందుకే ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా వారిని కులాల వారిగా సంతృప్తి పరచడానికే ప్రాధాన్యతనిస్తున్నాయి.ఇప్పుడు జనసేన( Jana Sena ) తెలుగుదేశం కూటమికి ఇప్పుడు ఈ సామాజిక సమీకరణాలే పెద్ద సమస్యగా మారినట్లు తెలుస్తుంది.

ముఖ్యంగా జనసేనకి ఆది నుంచి అండగా నిలబడిన కాపు సామాజిక వర్గం ఈసారి ఎలాగైనా రాజ్యాధికారం కావాలని బలంగా కోరుకుంటుంది.

ముఖ్యంగా పవన్ ( Pawan Kalyan )దూకుడు, వారాహి యాత్ర ( Varahi Yatra )మొదలైనవి పూర్తిస్థాయిలో విజయవంతం అవడంతో జనసేన 2024 లో క్రియాశీలక పాత్ర పోషించినా 2029 కల్లా ఒంటరిగా అధికారం సాధిస్తుందన్న ధీమా ఆ సామాజిక వర్గంలో కనిపించింది.అయితే షరతులు లేని పొత్తు అంటూ ఏకపక్షం గా పవన్ తెలుగుదేశంతో పొత్తు ప్రకటించడంతో ఇప్పుడు ఈ సామాజిక వర్గం ఆలోచన లో పడింది.సహజంగానే పొత్తులో బలమైన భాగస్వామి ముఖ్యమంత్రి పదవి చేపడతారు.

Advertisement

దాంతో తెలుగుదేశానికి ముఖ్యమంత్రి పదవి పవన్ వదిలేసాడు అన్న వ్యాఖ్యలు ఇప్పుడా సామాజిక వర్గాన్ని కలవరపరుస్తున్నాయి.సరిగ్గా ఇదే పాయింట్ను అధికార వైసిపి పట్టుకుంది.కాపుల్ని తెలుగుదేశానికి పవన్ తాకట్టుపెట్టేసారని సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం వెనక ఈ సామాజిక వర్గాన్ని ఆలోచనలో పడేయటమే లక్ష్యమని తెలుస్తుంది.తద్వారా జనసేనకు అవుట్ అండ్ రైట్ మద్దతు ఇచ్చే విషయంలో కాపు సామాజిక వర్గం మరోసారి ఆలోచిస్తుందని తద్వారా ఆ ఓటు బ్యాంకు ను చీల్చి తమకు రాజకీయ ప్రయోజనం కలిగే విధంగా అధికార పార్టీ ఎత్తుగడవేసినట్టుగా కనిపిస్తుంది

పవన్ నిర్ణయం పట్ల జనసేన ( Jana Sena ) అభిమానుల్లోనూ కాపు సామాజిక వర్గ నేతల్లోనూ కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రస్తుతం వారంతా పార్టీతోనే కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది .అయితే ముందు ముందు అధికార వైసిపి ( YCP )మరిన్ని కొత్త స్ట్రాటజీలు ముందుకు తీసుకొస్తే మాత్రం సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తుంది మరి జనసేన ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి .

Advertisement

తాజా వార్తలు