ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వైసీపీకి రాజధాని, రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని చెప్పారు.
ఏపీకి రాజధాని లేదన్న షర్మిల ప్రత్యేక హోదా రాలేదన్నారు. ఏపీ రాజధాని( AP Capital ) ఎక్కడా అని అడిగితే పదేళ్ల తరువాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి నెలకొందని విమర్శించారు.
చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది త్రీడీ గ్రాఫిక్స్ అయితే మూడు రాజధానుల పేరు( Three Capital )తో సీఎం జగన్ ఆడింది మూడు ముక్కలాటని మండిపడ్డారు.వైసీపీ( YCP ) వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు.మోదీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు.