స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) బాహుబలి, బాహుబలి2 తర్వాత సలార్ సినిమాతో భారీ హిట్ ను సొంతం చేసుకున్నారు.సలార్ మూవీ( Salaar ) 700 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సొంతం చేసుకుంది.
ప్రమోషన్స్ లేకుండానే ఈ సినిమా ఊహించని స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోగా ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
అయితే ప్రభాస్ గురించి కొన్ని విషయాలు తెలిసిన నెటిజన్లు రాజు ఎక్కడున్నా రాజే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
నిర్మాతల శ్రేయస్సు ప్రభాస్ తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ తన పారితోషికం మినహా నిర్మాత( Producer ) నుంచి అదనంగా రూపాయి కూడా ఆశించరట.తన స్టాఫ్ కు అవసరమైన వాటిని ప్రభాస్ సమకూరుస్తున్నారని స్టాఫ్ విషయంలో ప్రభాస్ నిర్మాతలను అస్సలు ఇబ్బంది పెట్టరని భోగట్టా.

ప్రభాస్ కు సొంతంగా కేరవాన్( Prabhas Caravan ) ఉండగా డ్రైవర్ కు కానీ అసిస్టెంట్లకు కానీ నిర్మాత రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.ప్రభాస్ షూట్ లో పాల్గొంటే ఆయన ఇంటినుంచి ఫుడ్ వస్తుంది.ఈ విధంగా నిర్మాతలపై ఫుడ్ విషయంలో కూడా అస్సలు భారం పడదు.
తన బౌన్సర్లు, బాడీ డబుల్ భారాన్ని కూడా ఆయన నిర్మాతలపై వేయరని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ప్రభాస్ లా మరో స్టార్ హీరో అయితే ఉండరని కచ్చితంగా చెప్పవచ్చని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.తన సినిమాల నిర్మాతలకు నష్టం వస్తే ఆదుకునే హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు.ప్రభాస్ చాలా గొప్పోడని ప్రభాస్ గొప్పదనం( Prabhas Greatness ) గురించి ఎంత చెప్పినా తక్కువేనని నెటిజన్లు చెబుతుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ ప్రస్తుతం కెరీర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడం గమనార్హం.







