ఇలా తగులుకున్నావేంటి చెల్లెమ్మా ? 

వ్యక్తిగతంగా,  రాజకీయంగా తన అన్న వైఎస్ జగన్ పై( YS Jagan ) కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.

( YS Sharmila ) ఎన్నికలకు ముందు నుంచి జగన్ పై అనేక విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ముఖ్యంగా తమ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య వ్యవహారం పై జగన్ ను టార్గెట్ చేసుకుని వైఎస్ షర్మిల ,  వైఎస్ సునీతలు విమర్శలు చేశారు.  కడప ఎంపీ అవినాష్ రెడ్డి దీనికి సూత్రధారి అని, ఆయనను జగన్ కాపాడుతున్నారని పదేపదే షర్మిల విమర్శలు చేస్తున్నారు.

ఎన్నికల ప్రచారం సమయంలోనూ ఈ వ్యవహారాలనే హైలెట్ చేసి జగన్ ను ఇరుకున పెట్టారు.  జగన్ ఐదేళ్ల పాలనా కాలంలో అవినీతి,  అరాచకాలు , హత్య రాజకీయాలు ఎన్నో జరిగాయని షర్మిల విమర్శలు చేశారు.

ఎన్నికల ఫలితాలు తర్వాత కూడా షర్మిల జగన్ ను వదిలిపెట్టడం లేదు.ఆ ఎన్నికల్లో వైసిపి 11 స్థానాలు మాత్రమే దక్కించుకోగా కాంగ్రెస్ ఒక స్థానంలోనూ గెలవలేకపోయింది.

Advertisement

కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన షర్మిల కూడా అవినాష్ రెడ్డి( Avinash Reddy ) చేతిలో ఓటమి చెందారు.ఎన్నికల ఫలితాలు తర్వాత షర్మిల పూర్తిగా పార్టీ పైన ఫోకస్ చేస్తారని అంతా భావించినా, మళ్ళీ జగన్నే టార్గెట్ చేసుకున్నారు .షర్మిల ఎన్ని విమర్శలు చేస్తున్న ప్రస్తుతానికి జగన్ సైలెంట్ గానే ఉంటున్నారు.ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల అంశాన్ని అప్పుడప్పుడు జగన్ ప్రస్తావించేవారు.

  చంద్రబాబు( Chandrababu ) కోవర్ట్  గా షర్మిలను పేర్కొనేవారు.అయితే ఇప్పుడు షర్మిల గురించి విమర్శలు చేసినా అనవసరం అన్న అభిప్రాయం లో ఉన్న జగన్ ఈ విషయంలో సైలెంట్ గానే ఉంటున్నారు.

కానీ మళ్ళీ ఇప్పుడు షర్మిల  జగన్ ను టార్గెట్ చేసుకున్నారు.

ఢిల్లీలో జగన్ ధర్నా చేయడానికి సిద్ధమవుతున్న క్రమంలో,  ఈ వ్యవహారంపై షర్మిల తీవ్రంగా స్పందించారు .జగన్ ఐదేళ్లపాటు హత్య రాజకీయాలు చేశారని విమర్శించారు.సొంత చెల్లెళ్ళకు వెన్నుపోటు పొడిచారని జగన్ పై మండిపడ్డారు.

సినిమా వాళ్ళ దెబ్బకి విశ్వక్ సేన్ అడ్రస్ మార్చేశాడట !
వలసలను ఆపడం కష్టమేనా ? జగన్ కు చిక్కులేనా ?

  బాబాయ్ హత్య పై ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయడం లేదని నిలదీశారు.  వివేకా హంతకులతో కలిసి జగన్ తిరుగుతున్నారని,  అసెంబ్లీలో ఉండకుండా జగన్ ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తారని ఆమె ప్రశ్నిస్తున్నారు.

Advertisement

ఒకవైపు కూటమి పార్టీల విమర్శలు , మరోవైపు షర్మిల వ్యక్తిగతంగా,  రాజకీయంగా చేస్తున్న విమర్శలు జగన్ కు తలనొప్పి గానే మారాయి.

తాజా వార్తలు