వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ వ్యవహార శైలి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తనకు మిత్రులు అనుకున్న వారితో ఎంత సఖ్యతగా ఉంటారో, తన శత్రువుల విషయంలోనూ అంతే కఠినంగా ఉంటారు.
పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో వేలుపెట్టి అనవసర విమర్శలు చేసిన వారు ఎవరినీ ఒక పట్టాన వదిలిపెట్టే మనస్తత్వం జగన్ కు లేదు.అయితే ఆవేశం గాను, ఆగ్రహంతోనూ తన శత్రువులను దెబ్బ కొట్టే స్టైల్ జగన్ ది కాదు.
ఆచితూచి, సరైన సమయం, సందర్భం చూసుకుని అన్ని సాక్ష్యాధారాలతో సహా కట్టడి చేసే విధంగా జగన్ ముందుకు వెళ్తున్నారు.తనకు రాజకీయ బద్ధ శత్రువులు అనుకున్న వారు పార్టీలో చేరేందుకు వస్తానన్నా, మొహమాటం లేకుండా జగన్ వ్యవహరిస్తున్నాడు.
మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు వ్యవహారం ను చూసుకుంటే, ఆయనను వైసీపీలో చేర్చుకునేందుకు జగన్ 50 కోట్లు ఆఫర్ చేసినట్లు లోకేష్ కొద్ది రోజుల క్రితం ఆరోపణలు చేశారు.అయితే ఈ ఆరోపణల్లో నిజం ఉందా లేదా అనేది అందరికీ తెలుసు.
ఎందుకంటే గత టిడిపి ప్రభుత్వంలో గాని, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కాని, జగన్ పై ఏ స్థాయిలో విరుచుకు పడేవారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తనపై వ్యక్తిగత దూషణలకు కూడా దిగిన అచ్చెన్నాను జగన్ విమర్శలను ఆషామాషీగా మరచిపోయే అవకాశమే లేదు.
ఇప్పుడు ఈఎస్ఐ స్కాం లో ఆయన దొరకకపోవడంతో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా విచారణకు ఆదేశించడం, అరెస్టు చేయించడం వంటివి చూస్తే లోకేష్ ఆరోపణల్లో వాస్తవం లేదనే విషయం అర్థమవుతుంది.

ఇక అనంతపురం జిల్లాకు చెందిన జెసి బ్రదర్స్ విషయంలోనూ జగన్ అంతే కఠినంగా వ్యవహరిస్తున్నారు.గతంలో జగన్, ఆయన కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరించిన తీరు జగన్ మరిచిపోరు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జెసి బ్రదర్స్ వైసీపీలో చేరేందుకు ప్రయత్నించినా జగన్ ఇష్టపడలేదు.
ఇప్పుడు ఆయన నకిలీ పత్రాలతో వాహనాలు అమ్మిన కేసులో సాక్ష్యాధారాలతో సహా దొరికిపోవడంతో, వెంటనే ఆయనను అరెస్టు చేయించడం వంటి సంఘటనలు జరిగాయి.టీడీపీలో మరో కీలక నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యవహారంలోనూ జగన్ ఇంతే స్థాయిలో వ్యవహరించారు.