కడప పార్లమెంట్ అభ్యర్ధిపై జగన్ సంచలన నిర్ణయం..??

ఏపీలో ఎనికల వాతావరణం వేడెక్కుతోంది.పార్టీల వ్యూహాల ప్రతి వ్యూహాలలో తలమునకలు అవుతున్నాయి.

పార్టీలో ఉన్న కీలక నేతలలో ఎవరిని అసెంబ్లీ , పార్లమెంట్ స్థానాలలో పోటీ చేయించాలి అంటూ వ్యుహాలు పన్నుతున్నారు.బలమైన అభ్యర్ధుల కోసం వేటను మొదలు పెట్టాయి.

ముఖ్యంగా ప్రధాన అధికార టీడీపీ ,ప్రతిపక్ష వైసీపీ మద్య డీ అంటే డీ అనే పరిస్థితి నెలకొంది.ఈ పరిస్థితుల్లో వైసీపీ వర్గాల నుంచీ వినిపిస్తున్న ఓ షాకింగ్ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది.

అదేంటంటే.!!

Advertisement

జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రాజకీయాల్లోకి వస్తున్నారని.అంతేకాదు ఆమె వచ్చే ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానం నుంచీ పోటీ చేస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.గత ఎన్నికల్లో వైసీపీ నుంచీ కడప పార్లమెంట్ స్థానంలో అవినాశ్‌రెడ్డి విజయం సాధించిన విషయం విధితమే.

అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం విధితమే.రాజీనామా చేసిన వారిలో అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు.

అయితే 2014ఎన్నికల్లో జమ్మలమడుగు అసెంబ్లీ నుంచీ వైసీపీ జెండా తో గెలిచినా ఆదినారాయణరెడ్డి ఆ తర్వాత సొంత ఎజెండాతో టీడీపీ లోకి జంప్ చేసి మంత్ర అయ్యారు.తాజా పరిణామాల నేపథ్యంలో కడప పార్లమెంట్ స్థానం నుంచి ఆదినారాయణరెడ్డిని బరిలోకి దించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని అందుకు సమర్ధుడు ఆదినే అని బాబు డిసైడ్ అయ్యారట.

ఒకవేళ ఆదినారాయణ ఎంపీ గా బరిలో ఉంటే గట్టి పోటీ ఉంటుంది కాబట్టి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

ప్రస్తుత సమయంలో కడప నుంచీ భారతిని బరిలోకి దించితే ఎలాంటి ప్రత్యర్ధులు అయిన సరే మట్టి కరవడం ఖాయం అని భావిస్తున్నారట జగన్.అయితే అవినాష్ రెడ్డి ని అసెంబ్లీ బరిలో దించి తన సతీమణిని పార్లమెంట్ స్థానంలో ఉంచాలనేది జగన్ వ్యూహంగా తెలుస్తోంది.అయ్తీ ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉందని త్వరలో ఈ విషయంపై అధికారిక ప్రకటన ఉంటుందని అంటున్నారు పలువురు నాయకులు.

Advertisement

మరి ఈ ఊహాగానాలు కార్యరూపం దాల్చుతాయా లేదా అనేది భవిష్యత్తులో తేలిపోనుంది.

తాజా వార్తలు