యువతే భారత దేశ వెన్నుముక:మంత్రి.రోజా చిత్తూరు జిల్లా,నగరి నియోజకర్గం,నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రేషర్స్ డే వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, క్రీడలు,సాంస్కృతిక మరియు యువజన అభ్యుదయ శాఖ మంత్రి.
ఆర్కే.రోజా సెల్వమణి మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని విధంగా జనాభాలో 50% మంది యువతే ఉన్న ఏకైక దేశం భారతదేశం అని యువత అనుకుంటే చరిత్రలు సృష్టిస్తారని, తలరాతలు మారిపోతాయాయని, ప్రభుత్వాలు కూలిపోతాయని, నిర్భయ చట్టం రావడానికి యువతే కారణమని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి కూడా యువత యొక్క ఉద్యమాలే కారణమని భవిష్యత్తుపై సరైన నిర్ణయాలు తీసుకునేది డిగ్రీ కళాశాల నుంచి మొదలవుతుందని తాను సినీ రంగానికి పరిచయమైనప్పుడు హీరోయిన్ కి తగ్గ కలర్ లేదని, డైలాగులు పలకడం రావ్ట్లేదని తననా పరిచయం చేసిన వారే వెక్కిరించిన వేళ కసితో ముందుకెళ్లాలనే తపనతో కష్టపడ్డానని,తనతో పోటీ పడి డాన్స్ చేసేవారు సినీ ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారంటే అది శిల్పా శెట్టి మరియు రోజా అని స్వయానా దిగ్గజా డాన్సర్ ప్రభుదేవాయే అన్నాడని, అందువలన ఎదగాలని కసితో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నామినేషన్ చేసేందుకు ఒక్కరోజు ముందే తనకి సీటు ఇచ్చి నగర్లోకి తీసుకొచ్చి వదిలారని, అయితే కొంతమంది వెన్నుపోటుల వలన తాను ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని, రెండోసారి చంద్రగిరిలో కూడా ఓడిపోయానని, ఓడిపోయిన అంతమాత్రాన భయపడి వెనక్కి వెళ్లకుండా రాజకీయాల్లోకి మళ్లీ మళ్లీ ప్రయత్నించానని ఎవరైతే ఆరోజు తనని అసెంబ్లీలోకి రానివ్వకుండా చేశారో వారి ముందే తనని చూస్తే అసెంబ్లీ దద్దరిలాల భయాన్ని సృష్టించాలని పరోక్షంగా చంద్రబాబు నాయుడుని, తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి మాట్లాడారు.ప్రధానంగా మహిళలు ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరుకుంటుంటే వారిని మానసికంగా ఇబ్బంది పెట్టి వెనక్కి పంపించేందుకు వారి క్యారెక్టర్ల మీద దెబ్బ కొడతారని అయితే ఏ ఒక్క మహిళా కూడా అందుకు భయపడకూడదని ఎందుకంటే మన క్యారెక్టర్ మీద తల్లిదండ్రుల కన్నా మనకే ఎక్కువ నమ్మకం ఉండాలని విద్యార్థునీలను ఉద్దేశించి మాట్లాడారు.