కాంగ్రెస్ ఈ ప్లాన్ వేసిందా..?  అయితే ఒకే

తెలంగాణలో కాంగ్రెస్ బలం పుంజుకునేందుకు ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తున్నా,  ఆ పార్టీలోని గ్రూపు రాజకీయాలు కారణంగా కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది .రెండుసార్లు జరిగిన  సార్వత్రికి ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా పరాజయం చెందింది.

 Congress Made This Plan But The Same , Congress, Pcc Chief,revanth Reddy, Aicc,-TeluguStop.com

ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఆ తరహా ఫలితాలు రిపీట్ కాకూడదని , తెలంగాణలో తప్పకుండా అధికారంలోకి రావాలని,  లేకపోతే కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా దెబ్బతింటుందనే ఆందోళన ఆ పార్టీ అగ్ర నాయకుల్లో కనిపిస్తోంది.ఇటీవల సీనియర్ నాయకులు అసంతృప్తికి గురి కావడంతో , కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దింపి పరిస్థితిని చక్కదిద్దారు.

Telugu Aicc, Congress, Komati Venkata, Manikrao Takre, Pcc, Revanth Reddy, Tpcc-

ఇక రేవంత్ రెడ్డికి పూర్తిగా స్వతంత్రం కల్పించడంతో ఆయన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పాదయాత్రకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా ఫోకస్ పెట్టే కంటే,  తమకు బలం ఉన్న నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టి పెడితే అక్కడ తప్పకుండా విజయం సాధించ వచ్చనే వ్యూహం తో కాంగ్రెస్ ఉంది.దీనిలో భాగంగానే 50 అసెంబ్లీ నియోజకవర్గాలలో కచ్చితంగా గెలవాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకుంది.ఈ యాభై నియోజకవర్గాల్లో ప్రభావం చూపించగలిగితే,  మ్యాజిక్ ఫిగర్ కు దగ్గర కావచ్చు అని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంటోంది.

అందుకే పార్టీ క్యాడర్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ముందుగా దృష్టి పెట్టంది. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మంలో పార్టీ పట్టు ఎక్కువగా ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.

ఈ జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలన్నిటిలోనూ గెలవాలనే టార్గెట్ పెట్టుకుంది.అలాగే మెదక్ , నిజామాబాద్ లో కొన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ గెలుస్తుందనే ఆశలు పెట్టుకుంది.దీంతోపాటు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ అంతట పాదయాత్ర చేపట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.దీంతోపాటు పార్టీలోని గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టే విధంగా రేవంత్ ముందడుగు వేస్తున్నారు.

Telugu Aicc, Congress, Komati Venkata, Manikrao Takre, Pcc, Revanth Reddy, Tpcc-

ఈ మేరకు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ.తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో రేవంత్ రెడ్డి అయ్యారు.రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత వెంకటరెడ్డిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.దీంతో నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ కేడర్ లోను కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.దీంతోపాటు ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్న ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు థాక్రే మూడు రోజులపాటు కాంగ్రెస్,  దాని అనుబంధ కమిటీలతో భేటీ కానున్నారు.ఈ వ్యవహారాల ద్వారా కాంగ్రెస్ కేడర్ లో  ఉత్సాహం రేకెత్తుతుందని , పార్టీ విజ అవకాశాలు మెరుగవుతాయని అంచనాలో కాంగ్రెస్ అధిష్టానం ఉందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube