సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు గ్లామరస్ రోల్స్ లో నటించి ఆ సినిమాలతో కమర్షియల్ సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు సక్సెస్ లను సైతం అందుకోవాలని కోరుకుంటారు.అయితే సాయిపల్లవి మాత్రం ఇతర హీరోయిన్లకు భిన్నంగా ముందుకెళుతున్నారు.
సక్సెస్ రేట్, ఆఫర్లు తగ్గుతున్నా సాయిపల్లవి మాత్రం అభినయానికి ప్రాధాన్యత ఉంటే మాత్రమే సినిమాలకు ఓకే చెబుతుండటం గమనార్హం.
అయితే సావిత్రి, సౌందర్య మాత్రమే గతంలో గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూ వార్తల్లో నిలిచారు.
సావిత్రి, సౌందర్య గొప్ప నటీమణులుగా గుర్తింపు తెచ్చుకోగా ఈ జనరేషన్ లో సాయిపల్లవికి కూడా అదే గుర్తింపు ఉంది.ఈ ముగ్గురు హీరోయిన్ల పేర్లు కూడా ఎస్ లెటర్ తో మొదలైన పేర్లు కావడం గమనార్హం.
సహాయ సహకారాలు అందించే విషయంలో సావిత్రి, సౌందర్య, సాయిపల్లవి ముందువరసలో ఉండేవారు.
ఈ హీరోయిన్లు వివాదాలకు దూరంగా ఉండటానికి కూడా ప్రాధాన్యతనిచ్చారు.ఈ హీరోయిన్లు నిర్మాతల హీరోయిన్లుగా పేరు సంపాదించుకున్నారు.ఏ రీజన్ వల్ల అయినా సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు వెనక్కు ఇచ్చే విషయంలో ఈ హీరోయిన్లు ముందువరసలో ఉండేవారు.
అయితే ఆ విషయాలను ప్రచారం చేసుకోవడానికి మాత్రం ఈ హీరోయిన్లు ఇష్టపడేవారు కాదు.ఈ హీరోయిన్లు చాలా గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ హీరోయిన్లలా మంచి మనస్సు ఉన్నహీరోయిన్లు అరుదుగా ఉంటారని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.సాయిపల్లవి కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడాల్సి ఉంది.సినిమా సినిమాకు సాయిపల్లవి నటిగా స్థాయిని పెంచుకుంటున్నారు.స్టార్ హీరోలకు జోడీగా ఛాన్స్ దక్కితే సాయిపల్లవికి తిరుగుండదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.సాయిపల్లవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది.