ప్లాట్‌ఫామ్‌పై లంచ్‌బాక్స్ కడుగుతుండగా యువకుడిని ఢీ కొట్టిన లోకల్ ట్రైన్.. వీడియో వైరల్..

ముంబైలోని మలాద్ రైల్వే స్టేషన్‌లో( Malad Railway Station ) ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది.17 ఏళ్ల మయాంక్ అనిల్ శర్మ( Mayank Anil Sharma ) అనే యువకుడు ప్లాట్‌ఫామ్ నంబర్ 3లో తన లంచ్‌బాక్స్ కడుగుతుండగా.దానిపైనే వేగంగా వచ్చిన రైలు అతన్ని ఢీకొట్టింది.ఇది జూన్ 17 మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగింది.దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ యువకుడు ఎంత దారుణంగా చనిపోయాడో నెటిజన్లు చూసి షాక్ అవుతున్నారు.

 Youth Gets Hit By Local Train While Washing Tiffin On Malad Railway Station Deta-TeluguStop.com

అయ్యో, పాపం! పట్టాల అంచున అలా ఎందుకు ఉన్నారు అసలు? అంటూ తమ సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు.

వైరల్ వీడియోలో మయాంక్, అతని స్నేహితులు ప్లాట్‌ఫామ్‌పై భోజనం చేయడం ముగించి, ప్లాట్‌ఫామ్ అంచు దగ్గర చేతులు, లంచ్‌బాక్స్‌ను శుభ్రం చేస్తున్నట్లు కనిపించింది.కొద్ది సెకండ్లలోనే చర్చిగేట్ నుంచి బోరివలికి వేగంగా వెళ్తున్న రైలు స్టేషన్ వద్దకు వచ్చి మయాంక్‌ను ఢీకొట్టింది.దీని ప్రభావం తీవ్రంగా ఉండడంతో గాలిలోకి రెండు మీటర్ల ఎత్తున ఎగిరి ఆ యువకుడు చాలా బలంగా నేలపై పడిపోయాడు.

ట్రైన్ చాలా వేగంతో ఢీకొట్టడం, ప్లాట్‌ఫామ్‌పై బలంగా పడిపోవడం వల్ల అతడు అక్కడికక్కడే మరణించాడు.ఈ ఘటన మొత్తం స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డయింది.

తాజాగా దీనిని ట్విట్టర్ యూజర్ @manthanTOI షేర్ చేశారు.దీన్ని చూసిన నెటిజన్లు కొందరు లోకో పైలట్‌ని విమర్శించారు.హార్న్‌ కొట్టి ఉంటే ఆ బాలుడు అప్రమత్తమై ఉండేవాడని అన్నారు.ఈ సంఘటన జరిగిన సమయంలో ఇంకో బాలుడు మయాంక్ ముందే ఉన్నాడు.అతడు ట్రైన్ వస్తున్న విషయాన్ని గమనించాడు.ఆపై తన ప్రాణాలను కాపాడుకున్నాడు.

ఆ బాలుడు అప్రమత్తం చేసినా మయాంక్ బతికి ఉండేవాడని మరికొందరు పేర్కొన్నారు.ఏదేమైనా రైల్వే స్టేషన్‌లో, ట్రైన్ ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube