హెచ్‌డీఎఫ్‌సీ డ్యూయల్ కంపెనీల( HDFC ) మెర్జ్ తరువాత, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జాతకం పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు.హెచ్‌డీఎఫ్‌సీని తనలో కలుపుకుని, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన బలాన్ని మరింత పెంచుకుంది.
ఇంకేముంది, కట్ చేస్తే ప్రపంచంలోని అత్యంత విలువైన బ్యాంకుల లిస్ట్‌లోకి వెళ్ళిపోయింది.దాంతో అతి పెద్ద అమెరికన్ మరియు చైనీస్ బ్యాంక్‌ల సరసన చేరిపోయింది.బ్లూమ్‌బెర్గ్ డేటా( Bloomberg data ) వివరాలు ఒకసారి పరిశీలిస్తే… మెర్జర్ తర్వాత, 416.5 బిలియన్ డాలర్లు మార్కెట్ విలువ వున్న JP మోర్గాన్ చేస్ & కో, 228.3 బిలియన్ డాలర్లు విలువ కలిగిన ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్, 227.7 బిలియన్ డాలర్లు విలువ కలిగిన బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్ తర్వాత నాలుగో స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 171.8 బిలియన్ డాలర్లు విలువతో వెలిగిపోతోంది.

అయితే, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్ మెర్జర్ జులై 1 నుంచి అమలులోకి రానుందని తెలుస్తోంది.కొత్త HDFC బ్యాంక్ ఎంటిటీకి దాదాపు 120 మిలియన్ల మంది కస్టమర్లు వున్నారు.అంతే ఇది జర్మనీ జనాభా కంటే ఎక్కువ అని చెప్పుకోవచ్చు.
ఇకపోతే HSBC హోల్డింగ్స్ Plc( HSBC Holdings Plc ), సిటీ గ్రూప్ సహా చాలా బ్యాంకుల కంటే HDFC పైకి దూసుకుపోతుంది అని చెప్పుకోవచ్చు.మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత భారత్‌లో రెండో అతి పెద్ద కంపెనీగా వెలుగొందుతోంది.27 జూన్ 2023 నాటికి, రూ.16,83,950 కోట్ల మార్కెట్ క్యాప్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో ఉంది.

ఇక HDFC బ్యాంక్, HDFC మార్కెట్ క్యాప్‌ను జోడిస్తే, మెర్జ్‌డ్ ఎంటిటీ రూ.14,45,958 కోట్ల విలువతో సెకండ్ ప్లేస్‌లో ఉంటుంది.ఇప్పటి వరకు ఆ ర్యాంక్‌లో వున్న టాటా గ్రూప్ ఐటీ కంపెనీ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (TCS) మూడో స్థానానికి పడిపోవడం గ్యారంటీ అని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా HDFC బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కంటే రెండింతలు పెద్దదిగా మారనుంది.రానున్న రోజుల్లో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI కన్నా దాదాపు 3 రెట్లు పెద్దదిగా అవతరించనుంది.27 జూన్ 2023 నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ విలువ రూ.5.03 లక్షల కోట్లు.విలీనానికి ముందు, డిపాజిట్లను సంపాదించడంలో తన పోటీ బ్యాంకుల కంటే HDFC బ్యాంక్ స్థిరంగా ఔట్‌పెర్ఫార్మ్ చేసింది.







